'పీకే కోసం సల్మాన్ న్యూడ్ గా మారాలి'

21 Aug, 2014 13:17 IST|Sakshi
'పీకే కోసం సల్మాన్ న్యూడ్ గా మారాలి'

ముంబై: సల్మాన్ ఖాన్ ను బట్టల్లేకుండా చూడాలనుకుంటున్నట్టు ఆమిర్ ఖాన్ వెల్లడించాడు. పీకే' సినిమా పోస్టర్ లో ఆమిర్ ఖాన్ నగ్నంగా కనిపించాడు. ఇదే ఫీట్ సల్మాన్ ఖాన్ చేస్తే చూడాలనివుందని అతడు పేర్కొన్నాడు. ఆమిర్ ఖాన్ ప్రతినాయక పాత్ర పోషించిన 'ధూమ్ 3'ని సల్మాన్ ప్రమోట్ చేశాడు. ఆమిర్ పెట్టుకున్న టోపీ పెట్టుకుని 'బిగ్ బాస్' రియాల్టి షో పాల్గొన్నాడు సల్మాన్.

'బిగ్ బాస్ లో ధూమ్ 3కి సల్మాన్ ప్రచారం చేశాడు. ఇప్పుడు పీకే సినిమాకు అతడు ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు సల్మాన్ చొక్కా మాత్రమే విప్పాడు. ఇప్పుడు ఫ్యాంట్ విప్పాలి. సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ షిప్కు ఇది పరీక్ష' అని ఆమిర్ ఖాన్ పేర్కొన్నాడు. స్నేహితుడి కోసం సల్మాన్ న్యూడ్ గా మారతాడో, లేదో చూడాలి.