విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఇంద్రకోబై

2 Oct, 2016 02:31 IST|Sakshi
విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఇంద్రకోబై

ఎన్ని కోణాల్లో తెరపై ఆవిష్కరించినా బోర్ కొట్టని అంశం ప్రేమ ఒక్కటే. జాతి, మతం, ఆస్తి, అంతస్తులు చూడకుండా కలిగేదీ ఒక్క ప్రేమే. ఎలాంటి అవరోధాలనైనా ఎదిరించి గెలిచేది ప్రేమ. అలాంటి ప్రేమను మరో కోణంలో ఆవిష్కరించే చిత్రం ఇంద్రకోబై .అయూమ్ క్రియేషన్స్ పతాకంపై లక్ష్మీప్రియ అయూమ్ గణపతి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరిదారం చిత్రం ఫేమ్ విజయ్.టి.అలెగ్జాండర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు.
 
  రోనాల్డ్‌రీగన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో రాజ్, ఆశాలత, విక్కీ, మంజు, జయలక్ష్మీ, కిచ్చా, దామోదరన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ 1990లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న విభిన్న ప్రేమ కథా చిత్రం ఇంద్రకోబై అని తెలిపారు. ప్రేమించి,పెళ్లి చేసుకున్న జంటను వారి తల్లిదండ్రులు, సమాజం వెలి వేస్తే జరిగే పరిణామాలేమిటన్నది చిత్ర ఇతివృత్తం అని చెప్పారు.ఈ కథ కోసం చాలా శోధించి  తయారు చేసినట్లు తెలిపారు. అదే విధంగా చిత్రం హీరో ఎంపిక జరగకుండానే షూటింగ్‌ను ప్రారంభించి హీరో లేని సన్నివేశాలను చిత్రీకరించినట్లు వివరించారు.
 
 అలా షూటింగ్ చేస్తున్న సమయంలో అది చూడడానికి వ చ్చి వారిలో ఒక వ్యక్తి తన కంట పడ్డారన్నారు. ఆయనతో నటిస్తావా? అని అడగ్గా తనూ రెడీ అన్నారని, దీంతో మీరే చిత్ర హీరో అని చెప్పానన్నారు. అలా రాజ్ ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమవుతున్నారని తెలిపారు. అదే విధంగా చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలను ఒక కొండపై భాగంలో చిత్రీకరిస్తుండగా బలమైన గాలి వీచడంతో కథానాయకి ఓణి ఎగిరి పోయిందన్నారు. దీంతో షూటింగ్ కొంత సేపు అంతరాయం కలిగిందని, మరో ఓణిని తెప్పించే వరకూ హీరోయిన్ చాలా అవస్థపడాల్సి వచ్చిందని తెలిపారు. మొత్తం మీద చిత్రం తాము ఊహించిన దానికంటే చాలా బాగా వచ్చిందనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం స్థానిక ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది.