తప్పక తప్పుకున్నా

18 Aug, 2018 01:06 IST|Sakshi
ఇర్ఫాన్‌ ఖాన్‌

ఇర్ఫాన్‌ ఖాన్‌ హెల్త్‌ కండీషన్‌ సడెన్‌గా అప్‌సెట్‌ అవ్వడంతో ఇండస్ట్రీ జనాలతో పాటు ఆయన ఫ్యాన్స్‌ కూడా షాక్‌ అయ్యారు. చాలా ప్రాజెక్ట్స్‌ ఆగిపోయాయి. న్యూరో ఎండోక్రైమ్‌ ట్యూమర్‌ ట్రీట్‌మెంట్‌ నిమిత్తం ప్రస్తుతం ఇర్ఫాన్‌ ఖాన్‌ లండన్‌లో ఉన్నారు. ఈ కారణంగా తాను అప్పటికే నటిస్తోన్న ఓ వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందని ఇర్ఫాన్‌ పేర్కొన్నారు. ఈ విషయం గురించి ఇర్ఫాన్‌ మాట్లాడుతూ –  ‘‘గోర్మింట్‌’ అనే సెటైరికల్‌ వెబ్‌ సిరీస్‌ కోసం కొన్ని నెలలు షూటింగ్‌ చేశా. ప్రస్తుతం నేనున్న పొజిషన్‌ చూస్తుంటే ఈ వెబ్‌ సిరీస్‌లో ఇక భాగం అవ్వలేనని అర్థం అయింది. చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆ సిరీస్‌ ఐడియా నన్ను చాలా థ్రిల్‌ చేసింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తప్పక తప్పుకుంటున్నా. ఫైనల్‌ ప్రొడక్ట్‌ చూడాలని చాలా ఆత్రుతగా ఉన్నాను. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు