బాలీవుడ్‌లో మరో బ్రేకప్

20 Sep, 2016 11:00 IST|Sakshi
బాలీవుడ్‌లో మరో బ్రేకప్

బాలీవుడ్లో మరో ప్రేమజంట కటీఫ్ చెప్పారు. యువ హీరోహీరోయిన్లు సిద్ధార్థ మల్హోత్రా, అలియా భట్ ప్రేమబంధం ముగిసినట్టు సమచారం. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన ఈ ప్రేమపక్షులు చాలాకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. సిద్ధార్థ, అలియా ప్రేమ గురించి పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇటీవల వీరిద్దరూ ప్రేమకు గుడ్ బై చెప్పి, వారి కెరీర్లపై దృష్టిసారించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

గత కొంతకాలంగా సిద్ధార్థ, అలియా దూరంగా ఉంటున్నట్టు సమాచారం. డ్రీమ్ టీమ్ టూర్ సందర్భంగా వీరిద్దరూ దూరంగా ఉన్నారని, మాట్లాడుకోవడం కూడా తక్కువని బాలీవుడ్ వర్గాలు చెప్పాయి. సిద్ధార్థ సినిమా కెరీర్కు సంబంధించిన విషయాలు మినహా వ్యక్తిగత జీవితం గురించి మీడియాతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాడు. ఇక అలియా కూడా ప్రేమ వ్యవహారానికి ముగింపు చెప్పి, పూర్తిగా సినిమాలపై దృష్టిపెట్టాలని నిర్ణయించుకుంది. ఇద్దరూ ప్రేమికులుగా గాక, స్నేహితులుగా ఉండాలని భావిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి