నయన్‌, అలియా, కత్రినాకు ఝలక్‌: అరంగేట్రంలోనే వందల కోట్లతో అదరగొడుతున్న అమ్మడు

17 Nov, 2023 16:16 IST|Sakshi

2023లో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. అలా అడుగుపెట్టిందో లేదో ఇలా బాక్సాఫీసు వసూళ్లతో దూసుకు పోతోంది. బాక్సాఫీస్ వద్ద  స్టార్‌ హీరోయిన్లు కత్రినా కైఫ్, నయనతార, అలియా భట్‌లను వెనక్కి నెట్టేసింది. డెబ్యూలోనే షారూఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌లతో చాన్స్‌ దక్కించుకొని.. నెక్ట్స్‌ ఎవరితో అనే ఆసక్తికర చర్చకు  తెర లేపింది. ఇంతకీ ఎవరా నటి? ఈ కథనంలో తెలుసుకుందాం!

ఆమె ఎవ్వరో కాదు స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌తో  పెంపుడు తల్లిగా నటించి  అందరి దృష్టినీ ఆకర్షించిన రిధి డోగ్రా. 2007 నుండి  నటిస్తోంది.  తొలుత టీవీ  తెరపై వెలిగిపోయింది. ఇటీవల ఓటీటీ  స్టార్‌గా రాణిస్తోంది.  కానీ దాదాపు 16 సంవత్సరాల తర్వాత అట్లీ దర్శకత్వంతో  వచ్చిన జవాన్‌  మూవీతో బాలీవుడ్ భారీ  బేక్‌ బ్రేక్ వచ్చింది. ఈ సినిమా ఏకంగా రూ.1150 కోట్ల కలెక్షన్లతో సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. దీంతో షారూక్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడంపై సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది. దీనికి తోడు ఇటీవల విడుదలైన టైగర్‌-3 సక్సెస్‌ ఆమెకు మరింత స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది. మనీష్ శర్మ దర్వకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ , ఇమ్రాన్ హష్మీ  లాంటి టాప్‌ స్టార్ల సరసన స్పై థ్రిల్లర్ టైగర్ 3లో నటించింది. దీపావళి కానుకగా నవంబర్ 10న సినిమా థియేటర్లలో విడుదలై ఈ మూవీ తొలివారంలోప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్లకుపైగా వసూలు చేసిందని టాక్‌.దీంతో తొలి ఏడాదిలోను 1500 కోట్ల క్లబ్‌లో చేరిందీ అమ్మడు.

మరో వెయ్యికోట్లపై  కన్ను
ఈ ఏడాదికి ఇంతకుముందెన్నడూ చేయలేదు అంటూ ఒక ఆసక్తికర విషయాన్ని ట్విటర్‌లో షేర్‌ చేసింది రిధి. జవాన్‌ మూవీ కలెక్షన్లు వెయ్యి కోట్లను దాటి నందుకు కృతజ్ఞతగా, అలాగే టైగర్‌ -3 కూడా  వెయ్యి కోట్ల మార్క్‌కు చేరాలని ప్రార్థిస్తూ ఈ  దీపావళికి  వెయ్యి దీపాలు వెలిగించింది.

ఎవరీ రిధి డోగ్రా
1984  సెప్టెంబర్  22న  పుట్టింది. న్యూ ఢిల్లీలోని షేక్ సరాయ్‌లోని అపీజే స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి కమలా నెహ్రూ కాలేజీ నుండి సైకాలజీ  పట్టా అందుకుంది. ఝూమ్ జియా రేతో తన టీవీ అరంగేట్రం.  హిందీ హై హమ్ (2009), YRF టెలివిజన్  రిష్తా డాట్‌ కామ్,సెవెన్ (2010), లాగీ తుజ్సే లగన్ (2010), మర్యాద…లేకిన్ కబ్ తక్? (2010-12), సావిత్రి (2013), యే హై ఆషికీ (2014), దియా ఔర్ బాతీ హమ్ (2015), వో అప్నా సా (2017-18),  ఖయామత్ కీ రాత్ (2018) లతో   ఆకట్టుకుంది.  2013లొ  డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియే 6, ఖత్రోన్ కే ఖిలాడి 6 (2014) తో పాపులర్‌ అయింది.

వెబ్‌లో సంచలనం 
సైకలాజికల్ థ్రిల్లర్ అసూర్‌తో రిధి ఓటీటీ అరంగేట్రం చేసింది. ఈ షో స్ట్రీమింగ్ ఇటీవలే దాని రెండవ సీజన్‌ కూడా సక్సెస్‌పుల్‌గా ముగిసింది. ముంబై డైరీస్, బద్దమీజ్ దిల్ , వెల్‌కమ్ టు యువర్ డార్క్ సైడ్ అండ్‌ ది మ్యారీడ్ వుమన్ అనే వెబ్ సిరీస్‌లలో అద్భుతమైన పాత్రలు పోషించింది. ఉత్తమనటిగా అవార్డు కొట్టేసింది.

దీపికాకు దీటుగా 
2023లో అత్యధిక వసూళ్లు సాధించిన  హీరోయిన్‌ దీపికా పదుకొనే. ఆమె నటించిన పఠాన్ , జవాన్ రెండు చిత్రాలు  ఏకంగా రూ.2200 కోట్లు రాబట్టాయి. దీపికా తరువాత రిధి డోగ్రా నిలుస్తోంది. నయనతార (రూ. 1150 కోట్లు), త్రిష కృష్ణన్ (రూ. 962 కోట్లు), అమీషా పటేల్ (రూ. 691 కోట్లు), రమ్య కృష్ణన్ (రూ. 610 కోట్లు), అలియా భట్ , కత్రినా కైఫ్ (ఇద్దరూ రూ. 350 కోట్లు) స్టార్లను దాటి పైకి ఎగబాకింది రిధి. 2011లో నటుడు రాకేశ్ బాపట్‌ను పెళ్లాడింది. కానీ మనస్పర్థల కారణంగా  2019లో భర్త నుంచి విడిపోయింది. 

మరిన్ని వార్తలు