టాప్ గేర్‌లో నభా నటేష్ 

14 Oct, 2019 17:07 IST|Sakshi

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. హీరో రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్‌ల మోత మోగించింది. అంతేకాకుండా చాలా రోజుల తర్వాత పూరి గెలుపు ట్రాక్‌ అందుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు ప్రస్తుతం వారి కెరీర్‌లో దూసుకపోతున్నారు. అయితే ప్రధానంగా యూత్ కి హార్ట్ బీట్ ని పెంచే హీరోయిన్‌గా నభా నటేష్ మారింది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్‌తో ఈ బెంగుళూరు భామ కెరీర్‌ టాప్ గేర్‌కి పడింది. ‘నన్నుదోచుకుండువటే’లో సిరి, ‘ఇస్మార్ట్ శంకర్’ చాందిని పాత్రలతో శభాష్ అనిపించుకున్న నభా ఇప్పుడు తెలుగు పరిశ్రమలో ట్రేడింగ్ హీరోయిన్‌గా బిజీ అయింది. 

సాయిధరమ్ తేజ్ తో ‘సోలో బ్రతుకే సో బెటర్’  మాస్‌ మహారాజ్‌ రవితేజతో ‘డిస్కో రాజా’ వంటి ఎగ్జైటింగ్‌ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. రవితేజతో నటిస్తున్న ‘డిస్కో రాజా’ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. అంతేకాకుండా నభా పలు ఈవెంట్స్‌లలో స్పెషల్  అట్రాక్షన్‌గా నిలుస్తోంది. తన ప్రజెన్స్‌కి ఏ వేదిక మీద అయినా స్పెషల్  అట్రాక్షన్ గా మారుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఈవెంట్ కి అయినా నభా ఫస్ట్ ఆప్షన్ అయ్యింది. తాజాగా  మెర్సిడస్ బెంజ్ కారుతో దిగిన ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ పిక్స్ లో నభా లుక్స్ కుర్రకారును పిచ్చెక్కిస్తున్నాయి. అంతేకాకుండా తన సోషల్ మీడియా ఫాలో వర్స్‌కి గ్రాటిట్యూడ్ చెబుతూ ఈ పిక్స్ ని షేర్ చేసుకుంది నభా నటేష్.

మరిన్ని వార్తలు