నిద్రపోనివ్వం!

24 Jun, 2018 00:47 IST|Sakshi
జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌

భయానికి అర్థం చెబుతా అంటున్నారు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌. కానీ హిందీ చిత్రంలో కాదు. ఇంగ్లీష్‌ మూవీలో. అంటే ఆమె హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు అని చెప్తున్నాం. జేమ్స్‌ సింప్సన్‌ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘డెఫినిషన్‌ ఆఫ్‌ ఫియర్‌’. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, కేథరిన్‌ బార్రెల్, బ్లిత్‌ హుబ్బార్డ్, మెర్సిడీస్‌ పాపాలియా ముఖ్య తారలుగా నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.

‘‘డెఫినిషన్‌ ఆఫ్‌ ఫియర్‌’ లాంటి సినిమాతో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది. మూవీ రిలీజ్‌ కోసం ఎగై్జటెడ్‌గా వెయిట్‌ చేస్తున్నాను’’ అన్నారు జాక్వెలిన్‌. ‘‘సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మిమ్మల్ని నిద్రపోనివ్వదు. జాక్వెలిన్‌ యాక్టింగ్‌ అమేజింగ్‌’’ అన్నారు దర్శకుడు జేమ్స్‌. నలుగురు అమ్మాయిలు టూర్‌ కోసం ఓ ఫారెస్ట్‌ వెళ్లిన తర్వాత జరిగే సంఘటనలతో ఈ సినిమా ఉంటుందట.

మరిన్ని వార్తలు