కృష్ణమాచారిగా...

6 Jan, 2019 02:49 IST|Sakshi
జీవా

భారతదేశానికి క్రికెట్‌లో తొలి ప్రపంచ కప్‌ సాధించి పెట్టిన ఘనత కపిల్‌దేవ్, అండ్‌ టీమ్‌కి దక్కుతుంది. 1983లో జరిగిన క్రికెట్‌ ప్రపంచకప్‌ పోటీల్లో ఇండియాని విశ్వవిజేతగా నిలిపి భారతీయులంతా గర్వపడేలా చేశారు. ఆ మధుర క్షణాల్ని, అప్పటి ఇండియా టీమ్‌ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ బయోపిక్‌ని బాలీవుడ్‌లో తెరపైకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ‘ఏక్‌ థా టైగర్‌’ ఫేమ్‌ కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో ‘1983’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కపిల్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నారు. 1983 ప్రపంచ కప్‌లో పాల్గొన్న ఇతర ఆటగాళ్లలో కృష్ణమాచారి శ్రీకాంత్‌ కూడా ఒకరు.

తమిళనాడుకు చెందిన శ్రీకాంత్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగి చక్కని ఆటతీరును ప్రదర్శించేవారు. ‘1983’ చిత్రంలో ఆయన పాత్రలో టాలీవుడ్‌ హీరోలు అల్లు అర్జున్, విజయ్‌ దేవరకొండ నటించనున్నారంటూ గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా శ్రీకాంత్‌ పాత్రలో హీరో జీవా నటించనున్నారట. తమిళనాడుకు చెందిన శ్రీకాంత్‌ పాత్రలో తమిళ హీరో అయితేనే బాగుంటుందని భావించిన చిత్రవర్గాలు జీవాని సంప్రదించడంతో ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట. అంతేకాదు.. ఈ పాత్ర కోసం కృష్ణమాచారి శ్రీకాంత్‌ వద్ద ఆయన క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటుండటం విశేషం. 

మరిన్ని వార్తలు