మ్యారేజ్‌ కోసం లైసెన్స్‌!

16 Sep, 2018 02:16 IST|Sakshi
జస్టిన్‌ బీబర్‌, హెయిలీ బాల్డ్‌విన్‌

పాప్‌ మ్యూజిక్‌ రాక్‌స్టార్‌ పాప్‌ను ప్లే చేయకుండా పెళ్ళి బజంత్రీలు మోగించేందుకు సిద్ధం అయ్యాడట. తన లేటెస్ట్‌ గాళ్‌ ఫ్రెండ్‌ హెయిలీ బాల్డ్‌విన్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు జస్టిన్‌ బీబర్‌. దానికోసం మ్యారేజ్‌ లైసెన్స్‌ తీసుకున్నారు ఇద్దరూ. డ్రైవింగ్‌ లైసెన్స్‌లా ఈ మ్యారేజ్‌ లైసెన్స్‌ ఏంటీ అనుకుంటున్నారా?.. ఈ ఇద్దరూ పెళ్ళి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ చర్చ్‌ లేదా ఆ దేశానికి సంబంధించిన స్టేట్‌ అథారిటీ ఇచ్చే సర్టిఫికేట్‌.

జూలై నెలలో ఈ జోడీ రింగులు మార్చుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ యువ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అని బీబర్‌ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రేమికుల సన్నిహితులు మాత్రం వచ్చే వారంలోనే పెళ్లి ఉండొచ్చంటూ హింట్స్‌ ఇస్తున్నారు. ఆ సంగతలా ఉంచితే.. మ్యారేజ్‌ లైసెన్స్‌ కేవలం 60 రోజులే వర్తిస్తుంది కాబట్టి ఈ రెండు నెలల్లో కచ్చితంగా పెళ్ళి భాజాలు వినొచ్చన్నమాట.
∙జస్టిన్, హెయిలీ

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సైలెంట్‌గా ఉన్నారు

నెక్ట్స్‌ ఏంటి?

వాళ్ల మైండ్‌సెట్‌ మారుతుందనుకుంటున్నా

ప్రేమ సందేశాలు

అందుకే వద్దనుకున్నా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైలెంట్‌గా ఉన్నారు

నెక్ట్స్‌ ఏంటి?

వాళ్ల మైండ్‌సెట్‌ మారుతుందనుకుంటున్నా

ప్రేమ సందేశాలు

అందుకే వద్దనుకున్నా!

హత్య చేసిందెవరు?