ఎయిర్‌పోర్ట్‌ లుక్‌ : కరీనా షర్ట్‌ ధర ఎంతంటే..

21 Aug, 2018 18:32 IST|Sakshi
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కరీనా కపూర్‌

ముంబై : బాలీవుడ్‌ భామల ఎయిర్‌పోర్ట్‌ ఎంట్రీ ఓ గ్రాండ్‌ ఈవెంట్‌లా మారింది. ఫ్యాషన్‌ ఐకాన్లుగా మెరుస్తూ ఫోటోలకు వారిచ్చే ఫోజులు రొటీన్‌గా మారాయి. ట్రెండీ దుస్తులు, ఆర్నమెంట్స్‌తో ఎయిర్‌పోర్ట్‌లో స్టన్నింగ్‌ లుక్స్‌తో వారు ఆకట్టుకుంటున్నారు. తాజాగా దుబాయ్‌ టూర్‌ ముగించుకుని ముంబై చేరుకున్న కరీనా కపూర్‌ స్టైలిష్‌ లుక్‌తో సందడి చేశారు.

మెటాలిక్‌ జిప్స్‌తో కూడిన తెలుపు రంగు స్వీట్‌ షర్ట్‌, బ్లూజీన్స్‌తో కనిపించిన కరీనా బ్రౌన్‌ హ్యాండ్‌ బ్యాగ్‌ ధరించారు. కేవలం ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో మేకప్‌ లేకుండా సింపుల్‌ లుక్స్‌తోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. కరీనా ఎయిర్‌పోర్ట్‌ లుక్‌లో ఆమె ధరించిన రూ లక్షా 11వేల విలువైన టీ షర్ట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మరిన్ని వార్తలు