యాక్షన్‌ థ్రిల్లర్‌

30 Apr, 2019 02:04 IST|Sakshi
భీమనేని శ్రీనివాస్, కార్తీకరాజు

కార్తీక్‌ రాజు, వర్ష బొల్లమ్మ జంటగా సంపత్‌ రాజ్‌ కీలక పాత్రలో నటించనున్న సినిమా ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దగ్గర అసోసియేట్‌గా వర్క్‌ చేసిన స్వరాజ్‌ నూనె ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆదిత్య మూవీ మేకర్స్‌ నిర్మాణంలో గురవయ్య యాదవ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమంలో దర్శక– నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్‌ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు క్లాప్‌ ఇచ్చారు. ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చింది. యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ఇది. శ్రీచరణ్‌ పాకాల మంచి బాణీలు సమకూర్చారు. జయపాల్‌ రెడ్డి కెమెరామేన్‌గా చేస్తారు’’ అన్నారు గురవయ్య యాదవ్‌. ఈ చిత్రానికి ఆర్‌వీ రామకృష్ణ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌.

మరిన్ని వార్తలు