అజ్ఞాతంలోకి మరో సినిమా : కత్తి మహేశ్‌

12 Jan, 2018 17:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సంక్రాంతి బరిలో తిరుగులేని రికార్డ్‌ ఉన్న నందమూరి బాలకృష్ణ, ఈ ఏడాది జై సింహాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే సంక్రాంతి బరిలో, భారీ అంచనాల నడుమ పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ సినిమా విడుదలై అభిమానులను నిరాశ పరచడంతో, అందరి చూపు ఇప్పుడు జైసింహాపైనే ఉంది. అయితే 80ల కథకి, 90ల కథనంతో 'జై సింహా' ఉందని ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ ట్విటర్‌లోపోస్ట్‌ చేశారు. 'గతిలేని కథ. గమనం లేని కథనం. వెరసి ఒక కలగురగంప సినిమా 'జై సింహ'. నిరర్ధకమైన కథలోని అసంబద్ధమైన పాత్రలో బాలయ్య. ఎందుకు ఉన్నామో తెలీని హీరోయిన్లు ముగ్గురు. అజ్ఞాతంలోకి మరో సంక్రాంతి సినిమా!' అంటూ పేర్కొన్నారు.

తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిన జై సింహా'లో నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటించారు.  రిస్క్ చేసి చూస్తే మీ ఇష్టం అంటూ అజ్ఞాతవాసి చిత్రానికి కత్తి రివ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు