‘పురందేశ్వరి ఓ మేకవన్నె పులి.. బాబుని పవన్‌ తిట్టిన తిట్లు ఎవరూ మర్చిపోరు’

7 Nov, 2023 15:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారనే భయం దగ్గుబాటి పురందేశ్వరిలో స్పష్టంగా కనిపిస్తోందని ప్రముఖ దర్శకనటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. పురందేశ్వరి ఓ మేక వన్నె పులి అని, ఆమె నిజస్వరూపం తెలిస్తే అంతా షాకవుతారు అని అన్నారాయన. మంగళవారం హైదారాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 

దగ్గుబాటి పురందేశ్వరి భారత ప్రధాన న్యాయమూర్తికి ఈ మధ్య లేఖలు రాశారు. దేశం మీద ఆమెకు ప్రేమ ఎక్కువ  ఉందని అంతా అనుకోవాలని ఆమె తాపత్రయపడుతున్నారు. కానీ, ఆమె ఎలాంటిదో అందరికీ తెలుసు. ఆమె సోదరుడు బాలకృష్ణ ఎలాంటి పనులు చేసినా ఆమె మద్దతు ఇవ్వడం అంతా చూశారు. బాలకృష్ణకు ఎలాంటి సంస్కారం ఉందో అందరికీ తెలుసు. బాలకృష్ణ ఆడవాళ్లపై దారుణమైన కామెంట్లు చేశారు. తుపాకీతో కాల్చి మనుషుల్ని చంపబోయారు.  ఆ ఘటన జరిగి 16 ఏళ్లు అయ్యింది. చివరికి చట్ట సభ్యుడిగా అసెంబ్లీలో విజిల్స్‌ వేసి.. తొడలు కొట్టి.. అభ్యంతరకర రీతిలో వ్యవహరించారు.  కానీ, బాలకృష్ణ ఏం మాట్లాడినా.. ఏం చేసినా పురందేశ్వరి మద్దతు ఇస్తారు. ఆయన మానసిక రోగి అని చాలామంది చెప్తుంటారు. మరి ఆయన ఇంకా మానసిక రోగిగానే ఉన్నారా? అనేది పురందేశ్వరి చెబితే బాగుంటుంది. 

చంద్రబాబు కోసమే పురందేశ్వరి పని చేస్తున్నారు. ఓటుకు ఓటుతో చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నించారు. ఆ కేసు తర్వాత చంద్రబాబు ఏపీకి పారిపోయాడు. అలాంటి వ్యక్తికి పురందేశ్వరి మద్దతు ఇస్తున్నారు. ఆమెకు నిజాయితీ, విలువలు రెండూ లేవు. ఆమె అసలు బీజేపీకి అధ్యక్షురాలు ఎందుకు అయ్యారు?. పార్టీ కోసం ఏనాడైనా పురందేశ్వరి పాటు పడ్డారా?. ఒక ఊరిలో అయినా తిరిగారా? అని పోసాని నిలదీశారు.  

‘‘రాష్ట్ర విభజన సమయంలో పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబును తిట్టిన తిట్లు ఎవరూ మరిచిపోలేరు.( ఆ విజువల్స్‌ను పోసాని ప్లే చేసి మీడియాకు చూపించారు కూడా). ఎందుకంటే.. పవన్‌ అంత ఘోరంగా తిట్టారు. ఇప్పుడు అదే చంద్రబాబుతో పవన్‌ పొత్తు పెట్టుకున్నారు. బాబుగారు, బాబుగారి వదిన పురందేశ్వరి, పవన్‌ ఎలాంటి వ్యక్తులో కాపు, కమ్మ వాళ్లంతా గుర్తించాల’’ని పోసాని విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు