సక్కనమ్మ చిక్కింది!

16 Nov, 2019 08:22 IST|Sakshi

ఏ రంగంలోనైనా ప్రతిభకే పట్టం కడతారు. ఇక సినిమా రంగం విషయానికి వస్తే ప్రతిభ, అదృష్టంతో పాటు అందం చాలా ముఖ్యం. ఒకప్పటి కంటే ఇప్పటి హీరోయిన్లు అందాలను కాపాడుకోవడానికి ఎక్కువగానే కసరత్తులు చేస్తుంటారు. నటి కీర్తీసురేశ్‌ కూడా ఇందుకు అతీతం కాదు. కీర్తీççసురేశ్‌కు అదృష్టం అనేది తన రెండవ చిత్రంతోనే వరించింది. ఇక నటన అంటారా, మహానటి చిత్రంలోనే తన ప్రతిభాపాఠవాలను చాటుకుంది. మరింకేంటి అంటారా? అంతా బాగానే ఉంది అయితే మధ్యలో ఈ చిన్నది కాస్త బరువెక్కింది. సామి స్క్వేర్‌ లాంటి చిత్రాలు చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. పైగా ఆ సమయంలో కీర్తీసురేశ్‌ నటించిన సామీ స్క్వేర్, సండైకోళ–2 వంటి చిత్రాలు ఆమెను నిరాశ పరిచాయి. అదిగో అలాంటి సమయంలోనే అమ్మడికి బాలీవుడ్‌ నుంచి కాల్‌ వచ్చింది. ఇక బాలీవుడ్‌ సినీ వర్గాలు, అక్కడి సినీ ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వారికి హీరోయిన్లు బొద్దుగా ఉంటే నచ్చదు. కీర్తీసురేశ్‌ స్లిమ్‌గా మారాల్సిన పరిస్థితి. ఇక డైట్‌లు, ఎక్సర్‌సైజ్‌లు అంటూ కసరత్తులు చేయక తప్పలేదు. మొత్తం ఈ సక్కనమ్మ చిక్కి మరింత నాజూగ్గా తయారైంది.

సర్కార్‌ చిత్రం తరువాత ఈ బ్యూటీని తెరపై చూడలేదు. అలాగని నటిగా కీర్తీసురేశ్‌ ఖాళీగా లేదు. తెలుగు, తమిళం, మలయాళం, ఇప్పుడు అదనంగా హిందీ అంటూ బహుభాషా నటిగా బిజీగా ఉంది. చాలా తక్కువ కాలంలోనే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాల నటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బోనీకపూర్‌ నిర్మిస్తున్న హిందీ చిత్రంలో అక్షయ్‌కుమా ర్‌కు జంటగా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది రెండవ భాగంలో తెరపైకి రానుంది. తమిళంలో దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్‌ నిర్మి స్తున్న పెన్‌గి్వన్‌ చిత్రాన్ని పూర్తి చేసింది. ఇది హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రం. ఇందులో కీర్తీసురేశ్‌ గర్భిణిగా నటించడం మరో విశేషం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న పెన్‌గి్వన్‌ చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక తెలుగులోనూ రెండు చిత్రాల్లో నటిస్తున్న కీర్తీసురేశ్‌ కోసం సూపర్‌స్టార్‌ చిత్రం ఎదురుచూస్తున్నట్లు ఇప్పటికే టాక్‌ స్ప్రెడ్‌ అయిన విషయం తెలిసిందే. ఇక మాతృభాష మలయాళంలో ఎలాగూ నటిస్తూనే ఉంది కీర్తి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా