నేటి విశేషాలు...

16 Nov, 2019 08:34 IST|Sakshi

► శ్రీలంకలో శనివారం అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కొత్త అధ్యక్షుడిని 1.59 కోట్ల మంది ఓటర్లు ఎన్నుకోనున్నారు. శ్రీలంక పీపుల్స్‌ ఫ్రంట్‌ పార్టీ తరఫున మాజీ డిఫెన్స్‌ సెక్రటరీ గొటబాయా రాజపక్స (70), అధికార పార్టీ అభ్యర్థి సాజిత్‌ ప్రేమదాస (52), నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (ఎన్‌పీపీ) పార్టీ అభ్యర్థి అనుర కుమారా దిస్సనాయకేలు అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు.


► శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం నేడు తెరుచుకోనుంది. దేవాలయ  ప్రధాన పూజారి కందరారు మహేశ్‌ మోహనరు, ముఖ్య పూజారి సుధీర్‌ నంబూద్రి శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు.

► సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గొగోయ్‌ ఆదివారం పదవీ విరమణ చేయనున్నారు. సీజేఐ హోదాలో శుక్రవారమే ఆయనకు చివరి వర్కింగ్‌ డే. 2018, అక్టోబర్‌ 3న సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌  గొగోయ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి న్యాయవ్యవస్థలో ఈ స్థాయికి ఎదిగిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

► ఆర్టీసీ కార్మికుల జేఏసీ శనివారం తలపెట్టిన బస్‌రోకోకు ఎలాంటి అనుమతి లేదని నగర పోలీస్‌ కమిషనర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నగరంలోని బస్‌ భవన్‌తో పాటు డిపోల వద్ద 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. ఇది శనివారం తెల్లవారుజామున 3గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 3గంటల వరకు వర్తిస్తుందన్నారు.

భాగ్య నగరంలో నేడు

వేదిక: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి  
అందాలరాణివే–సినీ సంగీత విభావరి  - సమయం: సాయంత్రం 4–30 గంటలకు  
సాగేను జీవితనావ–సినీ సంగీత లహరి -  సమయం: సాయంత్రం 5–30 గంటలకు  
⇒ ఏక్‌ హాన్‌ –ప్లే బై శేఖర్‌ సుమన్, సుచిత్రా కృష్ణమూర్తి అండ్‌ అదర్స్‌  
    వేదిక: రవీంద్ర భారతి, లక్డీకాపూల్‌  
    సమయం: రాత్రి 7–30 గంటలకు  

⇒ వేదిక: లమాకాన్‌ , బంజారాహిల్స్‌  
   ఏస్ట్రాంగర్‌ కనెక్ట్‌–టాక్‌ బై త్రిషా చటర్జీ  
   సమయం: సాయంత్రం 4 గంటలకు  
   గోండ్‌ ఫామ్‌ ఆఫ్‌ పేయింటింగ్‌  
   సమయం: ఉదయం 11 గంటలకు  
   రైట్‌ క్లబ్‌ మీట్‌అప్‌  
   సమయం: సాయంత్రం 3 గంటలకు  

⇒ సాటర్‌ డే నైట్‌ లైవ్‌ విత్‌ ది బ్లాక్‌ షీప్‌  
    వేదిక: హార్డ్‌ రాక్‌ కేఫ్, బంజారాహీల్స్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు  

 ఆర్‌పీఎల్‌ క్రికెట్‌ లీగ్‌  
    వేదిక: క్రికెట్‌ రాక్స్‌ , ఖాజాగూడ 
    సమయం: ఉదయం 7 గంటలకు  

⇒ సాటర్‌ డే క్లబ్‌ నైట్‌ విత్‌ డీజే దీజయ్‌  
    వేదిక: 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ బేగంపేట్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు  

 యూకేఅండ్‌ యూరోప్‌ఎడ్యుకేషన్‌ఫెయిర్‌  
    వేదిక: వివంతా బై తాజ్‌ , బేగంపేట్‌  
    సమయం: ఉదయం 10 గంటలకు  

⇒ వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్‌ , మారేడ్‌ పల్లి  
    కాంటెపరరీ డ్యాన్స్‌ క్లాసెస్‌ -   సమయం: ఉదయం 11 గంటలకు  
    షార్ట్‌ స్టోరీ రైటింగ్‌ వర్క్‌షాప్‌ -సమయం: సాయంత్రం 3 గంటలకు  
    టై డై వర్క్‌ షాప్‌- సమయం: ఉదయం 10–30  గంటలకు   

⇒ సాటర్‌ డే నైట్‌ లైవ్‌ విత్‌ ఆర్జ్‌  
    వేదిక: స్టోన్‌ వాటర్స్‌ –కిచెన్‌ 
    అండ్‌ లాంజ్‌ , జూబ్లీహీల్స్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు  

⇒ ఫ్రెంచ్‌ క్లాసెస్‌ విత్‌ సుపర్ణ గుహ  
    వేదిక: బుక్స్‌ ఎన్‌ మోర్‌ లైబ్రరీ అండ్‌ ఆక్టివిటీ సెంటర్, వెస్ట్‌ మారేడ్‌ పల్లి  
    సమయం: సాయంత్రం 5 గంటలకు  

⇒ ఐకాప్‌–2019 యూజీసీ యూపీఈ స్పాన్సర్ట్‌ ప్రోగ్రామ్‌  
    వేదిక డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ , తార్నాక  
    సమయం ఉదయం 10–30 గంటలకు  

⇒ హైదరాబాద్‌ స్కౌటింగ్‌ కిక్‌హప్స్‌ –పుట్‌బాల్‌ లీగ్‌  
    వేదిక: ఆస్ట్రో పార్క్‌ , ఫిల్మ్‌ నగర్‌  
    సమయం: ఉదయం 9 గంటలకు  

⇒ డీబీ ప్రొఫెషనల్‌ కప్‌ క్రికెట్‌ లీగ్‌  
    వేదిక: డాన్‌బాస్కో డిగ్రీ కాలేజీ , ఎర్రగడ్డ  
    సమయం: 7 గంటలకు  

⇒ సాటర్‌డేనైట్‌ లైవ్‌ విత్‌ షారూల్‌ అండ్‌ జేడీ  
    వేదిక హై లైఫ్‌ బ్రీయింగ్‌ కంపెనీ , జూబ్లీహీల్స్‌  
    సమయం రాత్రి 8 గంటలకు  

⇒ సాటర్‌డే బాలివుడ్‌ నైట్‌విత్‌ డీజేస్‌ కే అండ్‌ జాయ్‌  
    వేదిక: సౌండ్స్‌అండ్‌స్పిరిట్స్, మాదాపూర్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు  

⇒ సాటర్‌డే లేడీస్‌ నైట్‌విత్‌ డీజే పృథ్వీ సాయి  
    వేదిక: స్కైహై టెర్రాస్‌ అండ్‌ లాంజ్‌ , గచ్చిబౌలి  
    సమయం: రాత్రి 8 గంటలకు  

 నెర్వో లైవ్‌ కన్సర్ట్‌  
    వేదిక: నోవాటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ , కొండాపూర్‌  
    సమయం: రాత్రి 8 గంటలకు  

⇒ ఇంద్రజాల్‌ ప్లే  
    వేదిక: ఫోనిక్స్‌ ఎరీనా, హైటెక్‌సిటీ 
    సమయం: రాత్రి 7.30 గంటలకు  

⇒ 6వ హైదరాబాద్‌ 
    కార్పోరేట్‌ టెన్నీస్‌ అకాడమీ  
    వేదిక: ప్రొఫెషనల్‌టెన్నీస్‌ అకాడమీ, మణికొండ  
    సమయం: ఉదయం 9 గంటలకు    

మరిన్ని వార్తలు