‘ఆ పైనున్నోడు అందరికంటే పెద్ద మోసగాడు’

28 May, 2020 13:02 IST|Sakshi

'లాస్ట్ పెగ్' యాక్షన్ టీజర్ విడుదల

భరత్ సాగర్, యశస్విని రవీంద్ర జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లాస్ట్‌ పెగ్‌’. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. భవ స్పందన ప్రొడక్షన్స్‌పై రజత్‌ దుగోజి సలేంకి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌ పోస్టర్‌, ఫస్ట్‌ లుక్‌కు పాజిటీవ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా చిత్ర యాక్షన్‌ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. (బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. )

యాక్షన్‌ సీన్స్‌, పవర్‌ఫుల్‌ డైలాడ్‌లతో కూడిన ఈ టీజర్‌కు సైతం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సంగీత దర్శకుడు లోకేష్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ వావ్‌ అనిపించేలా ఉంది. టీజర్‌ విడుదల సందర్భంగా దర్శకుడు సంజయ్‌ మాట్లాడుతూ.. ‘యాక్షన్‌ టీజర్‌ విడుదల చేశాము. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను విడుదలచేస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ‘లాస్ట్‌ పెగ్‌’లో ఉండబోతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం’ అని అన్నారు. (ఎన్టీఆర్‌ కీర్తి అజరామరం: చిరంజీవి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా