హ్యకర్స్‌పై మండిపడ్డ పూజా

28 May, 2020 13:05 IST|Sakshi

తన సోషల్‌ మీడియా అకౌంట్‌ను హ్యక్‌ చేసిన వారిపై హీరోయిన్‌ పూజా హెగ్డే మండిపడ్డారు. మీరు బాగుపడరంటూ హ్యకర్స్‌పై  ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను సుమారు గంటసేపు హ్యక్‌ చేసినట్లు ఆమె గురువారం తెలిపారు. అయితే వెంటనే అకౌంట్‌ను సరిచేయాలని తన టెక్నికల్‌ టీమ్‌కు చెప్పినట్లు వెల్లడించారు. ఈ మేరకు పూజా ట్వీట్‌ చేశారు.‘బుధవారం రాత్రి నా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యక్‌ అయ్యింది. నేను నా టెక్నికల్‌ టీమ్‌కు ఇన్ఫార్మ్‌ చేశాను. వాళ్లు నాకు సహాయం చేస్తున్నారు. నా అకౌంట్‌ నుంచి ఏవైనా మెసెజ్‌లు, పోస్టులు వస్తే దయచేసి అంగీకరించవద్దు. అలాగే ఎలాంటి వ్యక్తిగత సమాచారం పంపించవద్దు. థ్యాంక్యూ’ అంటూ ట్వీట్‌ చేశారు. (దుల్కర్‌కు జోడిగా బుట్టబొమ్మ!)

అయితే ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌ తిరిగి సాధారణ స్థితికి వచ్చిందని పూజా తెలిపారు. గంట నుంచి ఇన్‌స్టా అకౌంట్‌ భద్రత గురించి ఆలోచిస్తున్నానని, ఇప్పుడు అంతా బాగుందని అన్నారు. తనకు సహాయం చేసినందుకు టెక్నికల్‌ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి ఎప్పటిలాగే ఇన్‌స్టాను ఉపయోగిస్తానని పేర్కొన్నారు. కాగా సెలబ్రిటీల సోషల్‌ మీడియా అకౌంట్‌లు హ్యక్‌ అవ్వడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకముందు అనుపమ పరమేశ్వరన్‌, కలర్స్‌ స్వాతి అకౌంట్లు‌ కూడా హ్యక్‌ అయ్యాయి. (ధోని రిటైర్మెంట్‌పై సాక్షి ట్వీట్‌.. డిలీట్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు