మీ విరాళానికి కృతజ్ఞతలు: లతా మంగేష్కర్‌

29 Apr, 2020 12:13 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. దీంతో వైద్యులు, మెడికల్‌ సిబ్బంది వైరస్ సోకిన వారికి చికిత్స అందించటంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సమయంలో వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ)లు చాలా అవసరం. ఈ క్రమంలో ప్రముఖ సెలబ్రిటీ చెఫ్‌ వికాస్‌ ఖన్నా వెయ్యి పీపీఈలను పూణెలోని దీననాథ్‌ మంగేష్కర్‌ ఆసుపత్రికి విరాళంగా అందించారు. వికాస్‌​ చేసిన సాయంపై దిగ్గజ గాయని లతా మంగేష్కర్ ట్వీటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. (బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్ కన్నుమూత)

‘దీననాథ్‌ మంగేష్కర్‌ ఆసుపత్రికి వెయ్యి పీపీఈలు విరాళంగా అందజేసిన వికాస్‌ ఖన్నాకి.. మంగేష్కర్‌ కుంటుంబం, దీననాథ్‌ ఆసుపత్రి నుంచి కృతజ్ఞతలు’అని లతా మంగేష్కర్‌ ట్వీట్‌ చేశారు. ఇక లతా తండ్రి దీననాథ్‌ మంగేష్కర్‌ జ్ఞాపకార్థం వైద్య సేవలు అందించడానికి 2001లో ఈ ఆసుపత్రిని స్థాపించిన విషయం తెలిసిందే. దీననాథ్‌ మంగేష్కర్‌ ప్రముఖ మరాఠి థియేటర్‌ నటుడిగా, గాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక లతా ట్వీట్‌పై వికాస్‌ ఖన్నా  స్పందిస్తూ.. ‘ప్రియమైన లతాజీ. మీరు మాకు ఆదర్శం. మా హృదయ పూర్వకమైన ప్రేమ, జీవితం మీకోసం’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు