అప్పుడు ఫోన్‌ ఆఫ్‌ చేస్తా..!

10 May, 2017 00:01 IST|Sakshi
అప్పుడు ఫోన్‌ ఆఫ్‌ చేస్తా..!

‘‘నా సినిమా హిట్టయినా ఫ్లాపయినా ఒకేలా స్వీకరిస్తా. నా నటన పట్ల నేను హ్యాపీగా లేనప్పుడు నిరాశ పడతా. హిట్టూ ఫ్లాపూ నా వృత్తి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించవు. అయితే సినిమా రిలీజ్‌కు ముందు మాత్రం టెన్షన్‌ పడతా. అందుకే ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసేస్తా’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. శర్వానంద్‌కు జోడీగా ఆమె నటించిన సినిమా ‘రాధ’. చంద్రమోహన్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సమర్పణలో భోగవల్లి బాపినీడు నిర్మించిన ఈ చిత్రం  శుక్రవారం రిలీజవుతోంది. లావణ్య చెప్పిన కబుర్లు...

సినిమాలో హీరో పేరు, నా పేరు రాధే. పేరు రాధ అయినా హీరోలో కృష్ణుడి పోలికలు ఎక్కువ. ఏ సినిమా చేసేటప్పుడైనా నా పాత్రకు ఇంపార్టెన్స్‌ ఎంతనేది ఆలోచిస్తా. ఈ ‘రాధ’ చిత్రకథ, అందులో నా పాత్ర, హీరో... మూడూ నచ్చాయి. ఓ ట్విస్ట్‌ బాగా నచ్చడంతో ఈ సినిమా చేశా. మంచి సస్పెన్స్, డ్రామా ఉన్నాయి.

ఈ రోజుల్లో కాలేజీ అమ్మాయిలు ఎలా ఉంటున్నారు? ఇంట్లో చాలా సైలెంట్‌. తమ సీక్రెట్స్‌ ఏవీ చెప్పరు. ఇంట్లోంచి బయటకు వస్తే... ఫ్రెండ్స్, పార్టీలు, అదంతా డిఫరెంట్‌ లైఫ్‌ సై్టల్‌! ఇందులో నా పాత్ర అలానే ఉంటుంది. పక్కా కమర్షియల్‌ కథానాయికగా కనిపిస్తా. గత సినిమాలతో పోలిస్తే... నా క్యారెక్టర్, యాక్టింగ్, లుక్, సాంగ్స్‌ ప్రతిదీ పక్కా కమర్షియల్‌. ఫస్టాఫ్‌లో హీరో నా వెంట పడతాడు. తర్వాత సీన్‌ మారుతుంది. అప్పుడు భలే భలేగా ఉంటుంది. నా క్యారెక్టర్‌లో కొంచెం కామెడీ టచ్‌ ఉంటుంది. సిచ్యుయేషనల్‌ కామెడీ సీన్లు ఎక్కువ కావడంతో మంచి హ్యూమర్‌ వర్కౌట్‌ అయింది.

శర్వానంద్‌తో నటించడం లవ్లీ ఎక్స్‌పీరియన్స్‌. ప్రతి హీరోయిన్‌ ఇదే మాట చెబుతుంటారు (నవ్వుతూ). అయితే సెట్స్‌లో శర్వా ఎక్కువ మాట్లాడడు. సిగ్గు ఎక్కువ. నేను మాట్లాడుతూనే ఉండేదాన్ని. అందువల్ల తను కూడా మాట్లాడవలసి వచ్చేది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే... శర్వా చాలా ఫన్నీ. నటన పట్ల అంకితభావం ఎక్కువ. దర్శకుడు చెప్పింది చేసేస్తే చాలు అనుకునే టైప్‌ కాదు. ఎలా నటిస్తే బాగుంటుందని ఆలోచిస్తాడు. సీన్స్‌ ఇంప్రొవైజ్‌ చేసేవాడు. దర్శకుడు చంద్రమోహన్‌కు ఇది మొదటి సినిమా అయినా ఎంతో బాగా తీశారు.

ప్రస్తుతం నాగచైతన్యకు జోడీగా ఓ సినిమా చేస్తున్నా. నాగార్జునగారితో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చేసిన తర్వాత ఇంత త్వరగా చైతూతో చేసే ఛాన్స్‌ వస్తుందనుకోలేదు. తండ్రీకొడుకులతో సినిమాలు చేస్తున్నాననే ఫీలింగ్‌ నాకు లేదు. ఎందుకంటే... ప్రేక్షకులు తెరపై పాత్రలను కేవలం పాత్రలుగానే చూస్తారని ఆశిస్తున్నా. ‘మనం’లో చైతూతో ఓ సీన్‌ చేశా. ఇప్పుడు తన సరసన హీరోయిన్‌గా చేస్తున్నా. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశానో లెక్కేసుకోలేదు. మంచి సినిమాలు వస్తున్నాయి, చేస్తున్నాను. బహుశా... 50 సినిమాలు చేరువైతే లెక్కలు వేసుకుంటానేమో!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

నో కట్స్‌..

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అన్నీ గుర్తుపెట్టుకుంటా; ఐశ్‌ భావోద్వేగం!

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా

ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా!

‘సాహో’తో సై!

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌

‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’