జూన్‌లో జాయిన్‌ అవుతారు

1 Mar, 2020 04:39 IST|Sakshi

వంశీ పైడిపల్లితో ఓ సినిమాను ప్లాన్‌ చేశారు మహేశ్‌బాబు. అనుకోకుండా ఆ ప్రాజెక్ట్‌ స్టార్ట్‌ కాలేదు. ఇప్పుడు పరశురామ్‌తో చేయబోయే సినిమాను ట్రాక్‌ ఎక్కించే పనిలో ఉన్నారట మహేశ్‌. ఈ సినిమా జూన్‌లో స్టార్ట్‌ కానుందట. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనుల్లో ఉన్నారట దర్శకుడు పరశురామ్‌. ఉగాదికి ఈ సినిమా ముహూర్తం జరపాలనుకుంటున్నారని తెలిసింది. జూన్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుందని సమాచారం. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోందని టాక్‌. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా రెడీ అవుతుందని ఊహించవచ్చు. మరోవైపు చిరంజీవి–కొరటాల శివ కాంబినేషన్‌లో చేస్తున్న సినిమాలో మహేశ్‌ ఓ కీలక పాత్ర చేయనున్నారు. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు