మీ ప్రేమకు థాంక్స్: మహేశ్ బాబు

28 Sep, 2015 11:05 IST|Sakshi
మీ ప్రేమకు థాంక్స్: మహేశ్ బాబు

శ్రీమంతుడు సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ పలు కేంద్రాల్లో ఆ సినిమా విజయవంతంగా నడుస్తోంది. దాంతో అభిమానులకు మహేశ్ బాబు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు. బేషరతుగా ప్రేమ, మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని చెబుతూ.. లవ్ యు ఆల్ అన్నాడు. దాంతోపాటు సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ట్రైలర్ను కూడా యూట్యూబ్ ద్వారా విడుదల చేసి, ఆ లింకును తన ట్వీట్తో పాటు అందించాడు.

బాహుబలి లాంటి పెద్ద సినిమా విడుదలైన తర్వాత వచ్చిన శ్రీమంతుడు కూడా మంచి హిట్ కావడంతో మొత్తం యూనిట్ అంతా మంచి సంతోషంగా ఉంది. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు దర్శకుడు కొరటాల శివకు మహేశ్ బాబు ప్రత్యేకంగా ఒక ఆడి కారును కూడా బహూకరించిన విషయం తెలిసిందే.