‘కేజీఎఫ్‌’ తరహాలో ఆది సాయికుమార్ కొత్త చిత్రం

10 Jul, 2020 19:02 IST|Sakshi

బాహుబ‌లితో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్ర‌పంచానికి తెలిసింది. అప్ప‌టి నుండి మ‌న టాలీవుడ్ హీరోలంద‌రూ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో యువ క‌థానాయ‌కుడు ఆది సాయికుమార్‌ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ రూపొందించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఒక సిరీస్‌లా చేయడానికి ప్లాన్ చేస్తుండ‌టం విశేషం. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ హీరోగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న ఆది సాయికుమార్ ఈ పాన్ ఇండియా చిత్రం త‌న‌కు పెద్ద బ్రేక్ అవుతుంద‌ని భావిస్తున్నారు. (పెళ్లి చేసుకోవాలంటూ ఆ హీరో నన్ను..)

ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్క‌బోతున్న ఈ చిత్రంలో ఫాంట‌సీ ఎలిమెంట్స్‌, వీఎఫ్‌ఎక్స్‌లకు ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంది. ఎస్వీఆర్‌  ప్రోడ‌క్ష‌న్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యాన‌ర్‌పై డెబ్యూ డైరెక్టర్ బాలవీర్.ఎస్‌‌ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న‌ ఈ చిత్రాన్ని ఎస్‌వీఆర్‌ నిర్మిస్తున్నారు. ఇది వ‌ర‌కు ఆది సాయికుమార్ చేసిన చిత్రాల‌కు భిన్నంగా కామిక్ ట‌చ్‌తో సాగే చిత్ర‌మిది. మేక‌ర్స్ రెండేళ్ల పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌పై దృష్టి పెట్టారు. ప్రేక్షకులంద‌రినీ ఆక‌ట్టుకునేలా ప‌క్కా స్క్రిప్ట్‌ను రూపొందించారు. ఈ పాన్ ఇండియా సిరీస్‌లో చాప్ట‌ర్1 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. (సమంత బ్యూటీ థెరపీ వీడియో)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు