రాముడిలాంటి రావణుడు?

26 Sep, 2016 00:03 IST|Sakshi
రాముడిలాంటి రావణుడు?

 ‘‘రాముడి రూపంలో ఉండే రావణుడి కథ ఇది. రాముడిగా మారిన రావణుణ్ణి చంపమని హనుమంతుడితో సీత చెప్పినప్పుడు.. రాముణ్ణి చంపాడా? లేదా? అనేది చిత్రం చూసి తెలుసుకోండి’’ అంటున్నారు ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్. ఆయన హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో రామ్‌జీతో కలసి నిర్మించిన చిత్రం ‘మన ఊరి రామాయణం’. దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదలవుతోంది.
 
  ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ - ‘‘శ్రీరామ నవమి రోజు జరిగిన ఓ సంఘటన నలుగురి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందనేది ముఖ్య కథ. భుజంగయ్యగా నేను, సుశీలగా ప్రియమణి, ఆటోవాలా శివగా సత్యదేవ్, గరుడ అనే దర్శకుడి పాత్రలో పృథ్వీ నటించాం. నాలుగు పాత్రల మధ్య నడిచే భావోద్వేగాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ చిత్రాన్ని విడుదల చేస్తోంది’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: రమణ గోపిశెట్టి, ప్రకాశ్‌రాజ్, పాటలు: భాస్కరభట్ల, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, కెమేరా: ముకేశ్, సంగీతం: ఇళయరాజా.