పవర్‌ఫుల్ బాంబ్

23 Jul, 2016 23:40 IST|Sakshi
పవర్‌ఫుల్ బాంబ్

 చట్టం ఎవరి చుట్టమూ కాదని ఆ న్యాయమూర్తి అభిప్రాయం. నీతికి, నిజాయితీకి కట్టుబడిన ఆ మహిళా మూర్తికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అప్పుడామె ఏం చేసింది? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్మీ బాంబ్’. ఫ్రమ్ శివకాశి.. అనేది ఉపశీర్షిక. మంచు లక్ష్మీప్రసన్న న్యాయమూర్తిగా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రాన్ని వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
 కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘మంచు లక్ష్మిగారి పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుంది. ఇటీవల రెండు ఫైట్స్,  రెండు పాటలు చిత్రీకరించాం. ఆగస్టు నెలాఖరు వరకూ కంటిన్యూస్‌గా జరిగే షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తిచేస్తాం’’ అన్నారు.
 
  ‘‘కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న కామెడీ థ్రిల్లర్ ఇది’’ అని దర్శకుడు తెలిపారు. పోసాని, హేమ, ప్రభాకర్, జీవా తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కథ-మాటలు: ‘డార్లింగ్’ స్వామి, కెమేరా: జోషి, సహ నిర్మాతలు : మురళి, సుబ్బారావ్, సమర్పణ: గూనపాటి సురేశ్ రెడ్డి, సంగీతం: సునీల్ కశ్యప్.