లుక్‌ మార్చేస్తున్న యంగ్ హీరో

25 Mar, 2018 13:09 IST|Sakshi
మంచు మనోజ్‌

హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న యంగ్ హీరో మంచు మనోజ్‌. మంచు వారసుడిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ యువ కథానాయకుడు స్టార్ ఇమేజ్‌ అందుకోవటంలో ఫెయిల్ అవుతున్నాడు. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లతో పాటు ప్రయోగాత్మక చిత్రాలతో కూడా ఫెయిల్ అయిన మనోజ్‌, త్వరలో ఓ రొమాంటిక్‌ లవ్‌ స్టోరితో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

కొత్త దర్శకుడు చందు డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ మేలో ప్రారంభం కానుంది. ఎక్కువ భాగం న్యూయార్క్‌ లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో మనోజ్‌ స్లిమ్‌ లుక్‌ లో కనిపించనున్నాడు. ఇప్పటికే వెయిట్ తగ్గేందుకు మనోజ్‌ జిమ్‌ లో కసరత్తులు చేస్తున్నాడట. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తో తెరకెక్కనున్న ఈ లవ్ స్టోరీ అయినా మనోజ్‌కు సక్సెస్‌ ఇస్తుందేమో చూడాలి.

మరిన్ని వార్తలు