‘క్రిష్‌ చేయని పనికి క్రెడిట్ అడుగుతున్నారు’

2 Feb, 2019 11:15 IST|Sakshi

మణికర్ణిక సినిమా వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే సోషల్‌ మీడియా వేదిక క్రిష్‌, చిత్ర యూనిట్‌పై ముఖ్యంగా కంగనా రనౌత్‌పై ఆరోపణలు గుప్పిస్తుంటే, కంగనా కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తోంది. పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ వివాదంపై స్పందిస్తున్నారు. కొందరు కంగనాను తప్పు పడుతుండగా, మరికొందరు క్రిష్‌ తీరును విమర్శిస్తున్నారు.

తాజాగా ఈ వివాదంపై స్పందించిన చిత్ర నిర్మాత కమల్‌ జైన్‌.. క్రిష్‌ వాదనను తప్పు పట్టారు. దర్శకురాలిగా కంగనా పేరు ముందు వేయటం అనేది నిర్మాణ సంస్థ నిర్ణయం అన్నారు. అంతేకాదు.. క్రిష్‌, తన వాదన సరైనదే అని భావిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చిన తెలిపారు. ఆయన, తను చేయని పనికి క్రెడిట్‌ కావాలని కోరటం సరైన పద్దతి కాదన్నారు. సినిమా సక్సెస్‌ సాధించిన తరువాత క్రిష్‌ తనకు క్రెడిట్‌ కావాలని వాదిస్తున్నారని విమర్శించారు.

మరిన్ని వార్తలు