ప్రేమని వ్యక్తపరచడం ఎలా? 

13 Mar, 2019 01:24 IST|Sakshi

దాదాపు 150 సినిమాలకుపైగా ఆర్ట్‌ డైరెక్టర్‌గా పని చేసి, 5 నంది అవార్డ్స్‌ గెలుచుకున్న అశోక్‌ కుమార్‌ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘మౌనమే ఇష్టం’. రామ్‌ కార్తీక్‌ హీరోగా, పార్వతి అరుణ్, రీతూవర్మ  హీరోయిన్లుగా నటించారు. ఏకే మూవీస్‌ పతాకంపై ఆశా అశోక్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ – ‘‘మంచి స్టోరీ కుదిరితే దర్శకత్వం చేయాలని 15 సంవత్సరాలుగా ఆలోచిస్తూనే ఉన్నాను. ‘మౌనమే ఇష్టం’ కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. క్యూట్‌ జెండర్‌ లవ్‌ స్టోరీ. ప్రేమని ఎలా వ్యక్తపరచాలన్నదే ఈ సినిమాలో మెయిన్‌ పాయింట్‌. సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది.

తప్పకుండా అందరూ చూడండి’’ అన్నారు. ‘‘అశోక్‌ కుమార్‌గారు ఈ సినిమాను యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ప్రతి ప్రేమకు ప్రపోజల్‌ ఎంతో ముఖ్యమైనది. అలాంటిది ప్రేమకు ప్రపోజల్‌ ఇబ్బంది అయితే ఆ ప్రేమికుడు పడే బాధ ఏంటి? అనేది ఈ సినిమాలో చూపించాం. ఇలాంటి మంచి ప్రాజెక్టులో నాకు అవకాశం ఇచ్చిన అశోక్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు సాయి కార్తీక్‌. ‘‘ఈ సినిమా తప్పుకుండా బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది. కార్తీక్‌కి ఈ చిత్రం ద్వారా నటుడిగా మంచి పేరు వస్తుంది’’ అన్నారు రీతూవర్మ. కథా రచయిత సురేష్, నటి ప్రియాంక, ప్రొడక్షన్‌ డిజైనర్‌ రాజీవ్‌ నాయర్, కెమెరామేన్‌ రామ్‌ తులసి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి  సంగీతం: వివేక్‌ మహాదేవా. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?