Sakshi News home page

అడ్డంగా దొరికిపోయి.. జడ్జిలపై నిందలా! 

Published Sun, Sep 17 2023 4:11 AM

Judiciary functioned properly in Chandrababus case - Sakshi

గాందీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): ‘అడ్డగోలుగా తప్పులు చేసి సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయి.. ఆ కేసుల్లో తీర్పు చెప్పిన జడ్జిలపై నిందలు వేస్తారా’ అంటూ టీడీపీ నాయకులు, ఆ పార్టీ అనుకూల మీడియాను పలువురు వక్తలు ప్రశ్నించారు. విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో ఆంధ్రా అడ్వకేట్స్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో ‘కోర్టు తీర్పులపై రాజకీయాలు–వక్ర భాష్యాలు’ అనే అంశంపై శనివారం సదస్సు జరిగింది. ఫోరం కన్వినర్‌ బి.అశోక్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో న్యాయవాదులు, న్యాయ నిపుణులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, మేధావులు పాల్గొన్నారు.

స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబుకు కోర్టు రిమాండ్‌ విధించిన నాటి నుంచి టీడీపీ నాయకులు, అనుకూల మీడియా న్యాయవ్యవస్థపై, జడ్జిలపై విమర్శలు చేయడాన్ని వక్తలు ఖండించారు. జడ్జిలపై వ్యక్తిత్వ హననం చేసేలా ఉన్న వ్యాఖ్యలను కోర్టులు సుమోటోగా తీసుకోవాలన్నారు. తీర్పులు తమకు అనుకూలంగా వస్తే ఒక విధంగా, వ్యతిరేకంగా వస్తే మరో విధంగా జడ్జిలపై నిందలు వేస్తూ మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

కోర్టు సాక్ష్యాధారాలు చూస్తుందని, చంద్రబాబు కేసులో పూర్తి సాక్ష్యా«ధారాలు చూపినందు వల్లే కోర్టు ఆయనకు రిమాండ్‌ విధించిందన్నారు. సదస్సు అనంతరం న్యాయవ్యవస్థపై నిర్వహించిన క్విజ్‌ పోటీలలో గెలుపొందిన పాఠశాలల విద్యార్థులకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేశారు. సదస్సులో వివిధ సంఘాల ప్రతినిధులు ఎం శ్రీనివాసరెడ్డి, బడేజానీ, హృదయరాజు, ఎం.కోటేశ్వరరావు, వలిపర్తి బసవరాజు తదితరులు పాల్గొన్నారు. 

న్యాయస్థానం సుమోటోగా తీసుకోవాలి 
రాష్ట్రంలో ప్రధాన మీడియా తీర్పులు చెప్పిన జడ్జిల వ్యక్తిత్వ హననానికి తెగబడుతోంది. తీర్పులపై చర్చలు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఇది కచి్చతంగా కోర్టు ధిక్కారం అవుతుంది. హైకోర్టు, సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకోవాలి. జైలర్‌ సెలవుపై పుంఖాను పుంఖాలుగా కథనాలు రాశారు. చివరికి అతని భార్య చనిపోతే ఆ వార్త కూడా కనిపించకుండా చేశారు.  – విజయబాబు, అధ్యక్షుడు, అధికార భాషా సంఘం  

కేసు పూర్వాపరాలు చూసే రిమాండ్‌ 
స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు సాక్ష్యా«ధారాలతో దొరికిపోయారు. జడ్జి పూర్వాపరాలు పరిశీలించిన మీదటే రిమాండ్‌ విధించారు. బెయిల్‌ పిటిషన్‌ వేయకుండా రిమాండ్‌ విధించడమే తప్పు అన్న వాదన తెచ్చారు. చంద్రబాబు తాను తప్పు చేయకపోతే నిర్థోíÙత్వం నిరూపించుకోవాలి. జడ్జిలను తప్పుబట్టడం, న్యాయస్థానాలను తప్పుబట్టడం సరికాదు.  – పి.గౌతంరెడ్డి, చైర్మన్, ఏపీ ఫైబర్‌ నెట్‌ 

జడ్జిల వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు 
కేసులు విచారణలో ఉండగా వాటిపై చర్చలు పెట్టడం, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. అక్రమ అరెస్ట్, రిమాండ్‌ అక్రమం, నిర్బంధం అక్రమమంటూ చెబుతున్నారు. వాస్తవానికి అది చెప్పాల్సింది కోర్టులు. కోర్టులు చెప్పాల్సిన అంశాలను మీడియా చానల్స్‌ చెప్పడం  దురదృష్టకరం.  – వీవీఆర్‌ కృష్ణంరాజు, ఎడిటర్స్‌ అసోసియేషన్‌  

చంద్రబాబు బొక్క బోర్లా పడ్డాడు 
స్కిల్‌ కుంభకోణం కేసులో చంద్రబాబుకు కోర్టు రిమాండ్‌ విధించడం చరిత్రాత్మక తీర్పు. ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న చంద్రబాబు చట్టం ముందు బొక్క బోర్లా పడ్డాడు. లూథ్రాను ఆంధ్ర న్యాయవాదులు తిప్పికొట్టారు.  – ఎం.గురునాథం, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్‌డీఎఫ్‌ 

ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదు 
చంద్రబాబు కేసులో నిష్పక్ష తీర్పు వచ్చింది. చంద్రబాబుకు జైల్లోనూ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. తనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. జడ్జిలపై విమర్శలు చేస్తూ ఏవేవో ఆపాదిస్తూ నిందలు వేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు.  – విఠల్‌ రావు, సీనియర్‌ న్యాయవాది 

సూత్రధారులకు శిక్ష తప్పదు 
ఏ కేసులోనైనా నేరం చేసిన వాడిది ఎంత తప్పో, నేరానికి ప్రేరేపించిన వాడిది అంతే తప్పు. కేసులో సాక్ష్యాధారాలు ఉంటేనే కోర్టు రిమాండ్‌ విధిస్తుంది. చంద్రబాబు కేసులో అదే జరిగింది. న్యాయవ్యవస్థపై, జడ్జిలపై నిందలు మోపొద్దు.  – జయరాజ్, మాజీ పీపీ 

తీర్పులకు వక్రభాష్యం తగదు 
తవ్వేకొద్దీ చంద్రబాబు స్కామ్‌లు బయటకు వస్తున్నాయి. ఇన్నాళ్లు కొందరు వ్యక్తులను అడ్డుపెట్టుకుని వ్యవస్థలను అనుకూలంగా మార్చుకున్నారు. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు రిమాండ్‌ విధిస్తే జడ్జి తీర్పులపై వక్రభాష్యం చెబుతున్నారు. కోర్టు తీర్పులపై మీడియా తప్పుడు ప్రచారం చేయడం సరికాదు. 
– ఎం.వెంకటేశ్వరరెడ్డి, హోటల్స్‌ అసోసియేషన్‌   

Advertisement

What’s your opinion

Advertisement