అల్లుడు  వెయిటింగ్‌

9 May, 2018 00:35 IST|Sakshi

అల్లుడు ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నాడు. ఫారిన్‌ నుంచి వచ్చిన తర్వాత కూడా అల్లుడిని అత్తయ్య పలకరించదట. వచ్చే నెలలోనే అత్తా–అల్లుడి మీట్‌ అవుతారు. నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. ఈ సినిమాకు ‘శైలజారెడ్డిగారి అల్లుడు’ అనే టైటిల్‌ అనుకుంటున్నారు. నాగచైతన్యకు అత్త పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నారు.

ప్రస్తతం ‘సవ్యసాచి’ షెడ్యూల్‌æకోసం న్యూ యార్క్‌లో ఉన్నారు నాగచైతన్య. ఈ షూట్‌ను కంప్లీట్‌ చేసుకుని ఈ నెల 18 నుంచి హైదరాబాద్‌లో జరగనున్న ‘శైలజా రెడ్డి’ షూట్‌లో  జాయిన్‌ అవుతారు. మరి... అత్త శైలజా రెడ్డి ఎంట్రీ ఎప్పుడు? అంటే.. జూన్‌ 15న అని తెలిసింది. 

మరిన్ని వార్తలు