తొలిప్రేమలో...

23 Apr, 2017 02:32 IST|Sakshi
తొలిప్రేమలో...

...రకుల్‌ పడిందనుకునేరు! అటువంటిది ఏం లేదు. మరి, ఎవరి తొలిప్రేమ గురించి చెబుతున్నారిప్పుడు? అనుకుంటున్నారా! రకుల్‌ తొలిప్రేమ కథే. కానీ, రియల్‌ లైఫ్‌లోది కాదు. రీల్‌ లైఫ్‌లోది. నాగచైతన్యకు జోడీగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్న సినిమా ‘రారండోయ్‌... వేడుక చూద్దాం’. ఇప్పుడు రకుల్‌ ఎక్కడికి వెళ్లినా, కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గురించే చెబుతున్నారు.

ఇప్పటివరకు రకుల్‌ చాలా సినిమాలు చేశారు. కానీ, ఈ సినిమా గురించే ఎందుకు స్పెషల్‌గా చెబుతున్నారంటే... ఆమె నటిస్తున్న ఫస్ట్‌ లవ్‌స్టోరీ ఇదేనట. ‘‘నా ప్రతి సినిమాలోనూ లవ్‌ ట్రాక్‌ ఉంది. అయితే... కథలో అది సైడ్‌ ట్రాక్‌గా మాత్రమే ఉండేది. ఏదో ఆకస్మికంగా హీరో హీరోయిన్లు ప్రేమలో పడతారు. కానీ, చైతూతో చేస్తున్నది మాత్రమే పక్కా ప్రేమకథ. ఈ ఇద్దరి ప్రేమకథలో మిగతావి సైడ్‌ ట్రాక్స్‌గా ఉంటాయి’’ అన్నారు రకుల్‌.

‘రారండోయ్‌... వేడుక చూద్దాం’ లో రకుల్‌ పక్కా పల్లెటూరి అమ్మాయి భ్రమరాంబగా నటిస్తున్నారు. సినిమా అంతా లంగా ఓణీలు, సంప్రదాయ దుస్తులు, బంగారు నగలతో కనిపించనున్నారు. చైతూ, రకుల్‌ క్యారెక్టర్లకు సినిమాలో ఈక్వల్‌ ఇంపార్టెన్స్‌ ఉంటుందట. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాను మే మూడో వారంలో విడుదల చేయాలనుకుంటున్నారు.