ఆయన ఫోన్‌ కాల్‌ రాగానే ఒప్పుకున్నా..

13 Jun, 2017 19:48 IST|Sakshi
ఆయన ఫోన్‌ కాల్‌ రాగానే ఒప్పుకున్నా..

కన్నడ నటి నందితా శ్వేత ఇప్పుడు కోలీవుడ్‌లోనూ వరుస అవకాశాలతో దూసుకు పోతోంది. తొలి చిత్రం అట్టకత్తితోనే సక్సెస్‌ను అందుకున్న లక్కీ నటి ఆమె. ఆ తరువాత వరుసగా ఎదిర్‌నీశ్చల్, తిరుడన్‌ పోలీస్‌ చిత్రాల్లో నటించి కథానాయకిగా నందిత మంచి గుర్తింపు పొందింది. శివకార్తికేయన్, విజయ్‌ సేతుపతి వంటి యువ నటులతో రొమాన్స్‌ చేసిన తామె ఎందుకనో స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను ఇంకా అందుకోలేకపోయింది. అయితే గత ఏడాది ‘ఎక్కడికి పోతావు చిన్నదానా’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం ఈ రెండు భాషల్లోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి అంటోంది.

సెల్వరాఘవన్‌ దర్శత్వంలో నెంజం మరప్పదిలై చిత్రంలో ఎస్‌జే.సూర్యకు జంటగా నటిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. నందితా శ్వేతా మాట్లాడుతూ సెల్వరాఘవన్‌ తన అభిమాన దర్శకుడని పేర్కొంది. ఆయన నుంచి ఫోన్‌ కాల్‌ రాగానే మరో మాట లేకుండా ఈ నెంజం మరప్పదిల్లై చిత్రంలో నటించడానికి అంగీకరించానని పేర్కొంది. ఆ తరువాతే ఇందులో ఎస్‌జే.సూర్య కథానాయకుడన్న విషయం తెలిసిందని చెప్పింది.

ఈ చిత్రంలో తనకు ఎస్‌జే.సూర్యతో రొమాన్స్‌ను మించి నటనకు అవకాశం పాత్ర లభించిందని అంది. యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఉంటాయని చెప్పింది. ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్నట్లు తెలిపింది. అందులో అరవిందస్వామికి జంటగా నటిస్తున్న వనంగముడి చిత్రం ఒకటని,. ఇందులో పోలీస్‌ పాత్రలో నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. అదే విధంగా చతురంగవేట్టై తెలుగు
రీమేక్‌లో నటిస్తున్నానని తెలిపింది. ఎలాంటి పాత్రలు పోషించాలని ఆశిస్తున్నారని అడుగుతున్నారని, తాను తమిళంలో అభినయానికి అవకాశం ఉన్న పాత్రలను, తెలుగులో గ్లామర్‌ పాత్రలను కోరుకుంటున్నానని చెప్పింది.