‘జెర్సీ’ వెనుక కష్టాలు

30 Mar, 2019 13:28 IST|Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జెర్సీ. మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని మిడిల్‌ ఏజ్‌ క్రికెటర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న జెర్సీ ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌.

ఇప్పటికే ఈటీజర్‌ అయిన టీజర్‌ సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో సినిమా మీద అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. తాజాగా జెర్సీ సినిమాలో క్రికెటర్‌గా నటించేందుకు నాని పడిన కష్టం, సినిమాను తెరకెక్కించేందుకు సాంకేతిక నిపుణులు పడిన కష్టానికి సంబంధించిన వీడియోను జర్నీ ఆఫ్‌ జెర్సీ పేరుతో రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్. ఈ వీడియోలో నాని 70 రోజుల పాటు క్రికెట్ ప్రాక్టీస్‌ చేయటం, షూటింగ్ గాయపడటం లాంటి అంశాలు ఉన్నాయి.

కేవలం క్లైమాక్స్‌లో వచ్చే క్రికెట్ ఎపిసోడ్‌ను మాత్రమే 24 రోజుల పాటు తెరకెక్కించినట్టుగా వెల్లడించారు. 2 అంతర్జాతీయ స్టేడియాలు, మరో 5 డొమాస్టిక్‌ స్టేడియాల్లో ఈ చిత్రకరణ జరిగినట్టుగా తెలిపారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో నానికి జోడిగా కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్‌ సంగీతమందిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు