1 వర్సెస్‌ 100

26 Apr, 2019 01:18 IST|Sakshi
నయనతార

నయనతార.. సౌతిండియా లేడీ సూపర్‌స్టార్‌. కమర్షియల్‌ సినిమాలు, లేడీ ఓరియంటెడ్‌ సబ్జెక్ట్స్‌ బ్యాలెన్స్‌ చేయడంలో ఎక్స్‌పర్ట్‌. ఎన్ని సినిమాలు చేసినా ప్రమోషన్స్‌కు, టీవీ ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటారు. సిల్వర్‌ స్క్రీన్‌ మీద మాత్రమే కనిపించడానికి ఆసక్తి చూపిస్తారామె. అయితే విచిత్రంగా నయనతార తమిళంలో ఓ టీవీ షో హోస్ట్‌ చేయబోతున్నారని తెలిసింది. కోలీవుడ్‌లో ఇదివరకూ ఖుష్బూ, రమ్యకృష్ణ తదితరులు టీవీషోలు హోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్‌లోకి లేట్‌ అయినా లేటేస్ట్‌గా ఎంట్రీ ఇస్తున్నారు నయన్‌.

‘1 వర్సెస్‌ 100’ అనే అమెరికన్‌ టీవీ షో తమిళ వెర్షన్‌కు హోస్ట్‌గా నయనతార కనిపిస్తారు. ఇన్ని సంవత్సరాలు ప్రమోషన్స్, టీవీలకు దూరంగా ఉన్న నయన్‌ ఈ షో అంగీకరించారంటే  షోలో ఖచ్చితంగా ఏదో స్పెషాల్టీ ఉండి ఉంటుందేమో. షో స్పెషల్‌గా ఉండటంతో పాటు నయనతారకు భారీ పారితోషికం ఆఫర్‌ చేశారట. త్వరలోనే ఈ ప్రోగ్రామ్‌ స్టార్ట్‌ కానుందట. ప్రస్తుతం చిరంజీవితో ‘సైరా’,  రజనీతో ‘దర్బార్‌’, విజయ్‌తో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు నయనతార. త్వరలో దర్శకుడు శివ, సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తారట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు