ప్రియాంక-నిక్‌ల పెళ్లి ఫోటోలతో భారీ ఆదాయం..!

11 Nov, 2018 19:46 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా, నిక్‌ జోనస్‌ల వివాహం దగ్గరికొస్తున్న కొద్దీ అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ దాకా ఈ పెళ్లి గురించి చర్చ నడుస్తోంది. అయితే ఈ పెళ్లికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. 

ఈ పెళ్లి వేడుకను కవర్‌ చేసేందుకు ఎన్నో ప్రపంచస్థాయి మేగజైన్స్‌ పోటీపడుతుండగా.. పెళ్లి ఫోటోలపై రైట్స్‌ను ఓ కంపెనీ  2.5మిలియన్‌ డాలర్ల( దాదాపు 18కోట్లు)కు కాంట్రాక్ట్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా వచ్చిన ఆదాయాన్ని ఈ జంట చారిటీకి వినియోగించనున్నారని సమాచారం. వీరి వివాహం ఈనెల 30, డిసెంబర్‌ 1, 2 తేదీల్లో  జోద్‌పూర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు