మహానాయకుడి పరిస్థితి మరీ దారుణం!

26 Feb, 2019 13:22 IST|Sakshi

తెలుగు హీరోలు ఈ మధ్య ఓవర్సీస్‌లో హవా చాటుతూ టాలీవుడ్‌ క్రేజ్‌ పెంచేస్తూ ఉన్నారు. మనోళ్లు అక్కడ మూడు, నాలుగు మిలియన్లు వసూళ్లు చేసేస్తున్నారు. అయితే ఇలా మన హీరోలు జోరు కొనసాగిస్తూ ఉంటే.. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రాలు మాత్రం అక్కడ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంటున్నాయి.

గతేడాది వచ్చిన భారీ చిత్రాల్లో కూడా కొన్ని చిత్రాలు పరాజయం పాలవ్వగా.. ఈ ఏడాది వచ్చిన పెద్ద సినిమాలు మాత్రం వరుసగా బోల్తా కొట్టేస్తున్నాయి. భారీ డిజాస్టర్‌ మూవీ లిస్ట్‌లోకి ఎగబడి మరీ వచ్చేస్తున్నాయి. ఈ ఏడాది వచ్చిన కథానాయకుడు, వినయ విధేయ రామ చిత్రాలు డిస్ట్రిబ్యూటర్లుకు దారుణంగా నష్టాలు తెచ్చి అత్యంత చెత్త సినిమాలుగా రికార్డులు సృష్టించాయి. అయితే గత శుక్రవారం విడుదలైన మహానాయకుడు ఆ రెండు చిత్రాలతో పోటీపడి అత్యంత చెత్త సినిమాగా రికార్డుకెక్కేందుకు సిద్దమైంది.

ఈ మహానాయకుడు కలెక్షన్లు చూస్తే ఎవ్వరైనా షాక్‌ అవ్వాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఈ మూవీ కనీసం నాలుగు కోట్లు కూడా వసూళ్లు చేయలేదని సమాచారం. బాలయ్య లాంటి పెద్ద హీరోకు ఇది మాత్రం ఘోర పరాభావమే. ఇక ఓవర్సీస్‌లో అయితే ఈ చిత్రం మరి ఘోరంగా దెబ్బతిందని తెలుస్తోంది. అత్యంత భారీ డిజాస్టర్‌ మూవీగా మహానాయకుడు రికార్డును.. ఈ ఏడాదిలో మరే చిత్రం అధిగమించకపోవచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా