34 ఏళ్ల తరువాత మణల్ కయిరు రీమేక్

24 Jan, 2016 02:33 IST|Sakshi
34 ఏళ్ల తరువాత మణల్ కయిరు రీమేక్

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అలా గత చిత్రాలెప్పుడు ఆపాత మధురాలే. ఇకపోతే 34 ఏళ్ల ముందు తెరపైకొచ్చిన మణల్ కయిరు చిత్రం చక్కని కుటుంబ కథా చిత్రంగా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు తెలుగు తదితర భాషల్లోనూ పునర్నిర్మాణమైంది.ఆ చిత్రానికి దర్శకుడు విసు సృష్టికర్త. ఆయన పెళ్లిళ్ల పేరయ్యగా నటించారు కూడా. ఇక అష్ట షరతులతో పెళ్లి చేసుకున్న యువకుడిగా ఎస్‌వీ.శేఖర్, కురియగోస్ రంగా ముఖ్యపాత్రలు పోషించారు.

ఆ చిత్రాన్ని ఇప్పుడు మణల్ కయిరు-2 పేరుతో శ్రీతేనాండాళ్ ఫిలింస్ పతాకంపై నిర్మాత రామస్వామి రీమేక్ చేస్తున్నారు. 34 ఏళ్ల తరువాత అదే పేరుతో పునర్నిర్మాణం కావడం విశేషం అయితే ఆ చిత్రంలో నటించిన నటులు అదే పాత్రల్లో మళ్లీ నటించడం మరో విశేషం. విసు, ఎస్‌వీ.శేఖర్, కురియగోస్ రంగా ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌వీ.శేఖర్ కొడుకు అశ్విన్ శేఖర్ ఆయన కొడుకుగానే నటిస్తున్నారు.

కురియగోస్ రంగా కూతురిగా నటి పూర్ణ నటిస్తుండగా ఇతర పాత్రల్లో లొల్లుసభ స్వామిరాథన్, శావ్యమ్, జగన్, జార్జ్ నటిస్తున్నారు. విసు కథకు ఎస్‌వీ.శేఖర్ కథనం,సంభాషణలు అందించగా మరుడామహేశ్ చిత్రం ఫేమ్ మదన్‌కుమార్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల చెన్నైలో ప్రారంభమైంది. దర్శకుడు విసు క్లాప్ కొట్టగా, ఎస్‌వీ.శేఖర్ స్విచ్ ఆన్ చేశారు. దీనికి తరుణ్ సంగీతాన్ని, గోపీనాథ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

>