ఆపరేషన్‌ ముగిసింది

24 Dec, 2018 01:32 IST|Sakshi
ఆది సాయికుమార్

ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌ ముగిసింది. మరి.. ఎలాంటి ఫలితాలు వచ్చాయి? ఈ ఆపరేషన్‌ ఎవరి కోసం? అనే విషయాలు తెలుసుకోవాలంటే ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ సినిమా చూడాల్సిందే. ఆది సాయికుమార్, శషా చెట్రి, కార్తీక్‌ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్‌ నందం, అబ్బూరి రవి, అనీశ్, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అడివి సాయికిరణ్‌ దర్శకుడు. కాగా ఈ సినిమాకి పని చేసిన యూనిట్‌ సభ్యులందరూ నిర్మాణంలో పాలుపంచుకోవడం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.

ఇందులో కమాండో అర్జున్‌ పండిట్‌ పాత్రలో నటించారు ఆది సాయికుమార్‌. ఆదివారం ఆది పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన కొత్త లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా సాయికిరణ్‌ మాట్లాడుతూ– ‘‘ఆది ఫస్ట్‌ లుక్‌కు విశేష స్పందన లభించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా రాసుకున్న ఫిక్షనల్‌ స్టోరీ ఇది. చాలా కష్టపడి తెరకెక్కించాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం. ఆ తర్వాత సినిమా విడుదల తేదీ వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు. దామోదర్‌ యాదవ్‌ ఈ సినిమాకు సహ నిర్మాత. కిరణ్‌ రెడ్డి తుమ్మ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌.

మరిన్ని వార్తలు