విమర్శల వలలో ప్రియ

8 Sep, 2014 01:14 IST|Sakshi
విమర్శల వలలో ప్రియ

 ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్నది ఆర్యోక్తి. అయితే నటి ప్రియాఆనంద్ ప్రవర్తన ఇందుకు భిన్నంగా ఉందనే అభిప్రాయం కోలీవుడ్‌లో వ్యక్తం అవుతోంది. మొన్నటి వరకు విజయం కోసం తహతహలాడిన ఈ బ్యూటీ ఇటీవల వరుసగా రెండు హిట్లు రావడంతో వాటిని తలకెక్కించుకున్నట్లు ప్రవర్తిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అమ్మడు ప్రస్తుతం నటుడు విమల్ సరసన ఒరు ఊరుల రెండు రాజా చిత్రంలో నటిస్తున్నారు.
 
 ఈ చిత్ర నిర్మాణ వ్యయం ముందుగా అనుకున్న దాని కంటే కోటిన్నర వరకు పెరిగి పోయిందట. ఇందుకు కారణం నటి ప్రియా ఆనందేనని అంటున్నారు. నిర్మాతల వద్ద ఆమె బాగా ఖర్చు పెట్టించిందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ అలంకరణ సామగ్రి కోసం ప్రియా ఆనంద్ అధికంగా ఖర్చు చేయించినట్లు కోలీవుడ్ టాక్. మరో విషయం ఏమిటంటే ప్రియా ఆనంద్ తమిళ సంస్క­ృతి సంప్రదాయాలను మంట గలుపుతున్నట్లు ఆమె అభిమానులే ఆగ్రహిస్తున్నారు.
 
 పియా ఆనంద్ ఇంతకు ముందు చేసిన అరిమా నంబి చిత్రంలో మద్యంలో మునిగి తేలేలా నటించడాన్ని ఆమె అభిమానులు తీవ్రంగా ఖండిస్తూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనికి ప్రియా ఆనంద్ ఘాటుగానే స్పందించారు. ఆడ - మగ సమానం అంటున్న ఈ రోజుల్లో మగవారు మద్యం సేవించగా లేనిది ఆడవారు సేవిస్తే తప్పా! మీకో న్యాయం మాకో న్యాయమా? అంటూ లా తీస్తుండడం ఆమె అభిమానులకే నచ్చడం లేదు. ప్రియా ఆనంద్ ప్రవర్తన మార్చుకోకపోతే సినిమాల్లో నిలదొక్కుకోవడం కష్టం అంటున్నారుు కోలీవుడ్ వర్గాలు.  
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి