న్యూయార్క్ టైమ్స్ జాబితాలో పవన్ కళ్యాణ్!

31 Oct, 2013 12:26 IST|Sakshi
న్యూయార్క్ టైమ్స్ జాబితాలో పవన్ కళ్యాణ్!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ స్టామినా ఒక్కసారిగా పెరిగిపోయింది. హిట్, ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా అభిమానుల హృదయాలను చూరగొన్న తెలుగు నటుల్లో పవన్ కళ్యాణ్ ది ఓ ప్రత్యేకమైన స్టైల్. గత కొద్దికాలం క్రితం వరకు సరియైన హిట్ లేక సతమతమైన పవర్ స్టార్ కు ఇటీవల కాలంలో ఘన విజయాలు అందివచ్చాయి. 
 
'గబ్బర్ సింగ్' తో బ్లాక్ బస్టర్ సాధించిన పవన్...'కెమెరామెన్ గంగతో రాంబాబు' హిట్ పర్వాలేదనిపించాడు. ఇక ఇటీవల వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం వంద కోట్ల కలెక్షన్లను సాధించే సత్తా ఉన్న చిత్రంగా వార్తల్లో నిలిచింది.  వరుస విజయాలతో బాక్సాఫీస్ ను కుదిపేస్తున్న పవన్ కళ్యాణ్ కు అన్ని సానుకూల పరిస్థుతులే ఎదురవుతున్నాయి.  'అత్తారింటికి దారేది' ఘన విజయం అందించిన ఉత్సాహాన్ని ఇంకా ఎంజాయ్ చేస్తున్న పవన్ కు మరో తీయ్యని వార్త అందింది. 
 
ఇటీవల న్యూయార్క్ టైమ్స్ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేల్లో భారత దేశంలో '10 మోస్ట్ డిజైరబుల్ యాక్టర్స్' జాబితాలో పవన్ కళ్యాణ్ ఐదవ స్థానం దక్కింది. దక్షిణాది నటుల్లో పవన్ కళ్యాణ్ అగ్రస్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో పవన్ ఐదవ స్థానంలో ఉండగా, ప్రిన్స్ మహేశ్ బాబు కు 6 స్థానం దక్కింది. 
 
న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ మొదటి స్థానం సొంతం చేసుకోగా, సల్మాన్ ఖాన్ రెండవ, అక్షయ్ కుమార్ మూడవ స్థానం, హృతిక్ రోషన్ నాలుగవ స్థానంలో దక్కించుకున్నారు.  తమిళ నటుడు విజయ్ 7వ, 8 వ స్థానం అమీర్ ఖాన్, రణబీర్ కపూర్ 9వ, అజయ్ దేవగన్ 10వ స్థానంలో నిలిచారు.