దుల్కర్‌కు జోడిగా బుట్టబొమ్మ!

22 May, 2020 17:18 IST|Sakshi

టాలీవుడ్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్న ఈ భామకు వరుసపెట్టి సినిమాలు ఒళ్లో వాలుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్‌ 20వ సినిమాలో నటిస్తున్న పూజా త్వరలో దుల్కర్‌ సల్మాన్‌తో జతకట్టనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ‘అందాల రాక్షసి’ ‘పడి పడి లేచే మనసు’ ఫేం హను రాఘవపుడి దర్శకత్వంలో దుల్కర్‌ తెలుగులో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. (ప్రభాస్‌ 20 మూవీ ఫోటోలు వైరల్‌)

దుల్కర్‌కు తెలుగులో ఇది రెండో సినిమా. ఇంతక ముందు ‘మహానటి’ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం చిత్ర యూనిట్‌ బుట్టబొమ్మను సంప్రదించినట్లు తెలుస్తోంది. వీడియో కాల్‌ ద్వారా కథ విన్న అనంతరం సినిమాలో నటించేందుకు ఈ ముద్దుగుమ్మ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రటకన రావాల్సి ఉంది. (బిగ్‌బాస్ 4: ఈసారి పాల్గొనేది వీళ్లేనా?)

వైజయంతి మూవీస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు చరుకుగా జరుగుతున్నాయి. సెప్టెంబర్‌ నెలలో రెగ్యూలర్‌  షూటింగ్‌ ప్రారంభమయ్యే అవకాశముంది. ఇక కొరియోగ్రాఫర్‌ బృందా దర్శకత్వం వహిస్తున్న హే సినిమికాలో దుల్కర్‌ నటిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌ కూడా త్వరలో తిరిగి ప్రారంభం కానుంది. అలాగే పూజ హెగ్డే చేతిలో ‘ప్రభాస్ 20’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కి జోడిగా ‘కభీ ఈద్ కభీ దివాలి’ చిత్రంలోనూ పూజా నటిస్తున్నారు. (‘నేను చచ్చిపోలేదు.. బతికే ఉన్నా’)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా