బుట్టబొమ్మ ఇష్టపడే క్రికెటర్‌ ఎవరో తెలుసా!

5 Jun, 2020 13:50 IST|Sakshi

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో వరుస హిట్స్‌తో దూసుకపోతున్న స్టార్‌ అండ్‌ క్రేజీ హీరోయిన్‌ పూజా హెగ్డే. సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే ఈ బట్టబొమ్మకు ఉండే ఫాలోయింగ్‌, క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఈ నటి తరుచూ సోషల్‌ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా లైవ్‌ చాట్‌లో పాల్గొన్న ఈ బ్యూటీ ఫ్యాన్స్‌, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో మీ ఫేవరేట్‌ క్రికెటర్‌ ఎవరని ఓ నెటిజన్‌ ప్రశ్నించాడు. (హ్యకర్స్‌పై మండిపడ్డ పూజా)

దీనికి ఏమాత్రం సంకోచించకుండా తనకు ఇష్టమైన క్రికెటర్‌ మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అంటూ ఠక్కున సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా తాను ద్రవిడ్‌కు వీరాభిమానినని, ఈ తరంలో ఎంతమంది గొప్ప ఆటగాళ్లు ఉన్నా అతడికి సాటిరారని తేల్చిచెప్పారు. ది వాల్‌ ఓ కూల్‌ అండ్‌ క్లాసిక్‌ ప్లేయర్‌ అని పేర్కొన్నారు. ప్రస్తుత ఆటగాళ్లలో ధోని, కేఎల్‌ రాహుల్‌ ఆటతీరు నచ్చుతుందన్నారు. ఇక ఎంత బిజీగా ఉన్నా టీమిండియా మ్యాచ్ జరుగుతుంటే కనీసం స్కోర్ తెలుసుకోవడానికైనా ప్రయత్నిస్తానని క్రికెట్ పట్ల తనకున్న ఇష్టం అలాంటిదని పూజా హెగ్డే తెలిపారు. (కాంబినేషన్‌ ఫిక్స్‌?)

ఇక శుక్రవారం తన నానమ్మతో దిగిన ఓ కూల్‌ ఫోటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు ఈ క్రేజీ బ్యూటీ. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇక ఈ అమ్మడి సినిమా విషయాలకు వస్తే.. ఈ ఏడాది తెలుగులో ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో భారీ విజయాన్ని అందకున్న పూజా ప్రస్తుతం ప్రభాస్‌, అఖిల్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.  (హ్యాపీ బర్త్‌డే ‘కామ్రేడ్‌ భారతక్క’)

Home with my gundu/jigar ka tukda/bangaram ❤️ #ajji #grandma #cutie

A post shared by Pooja Hegde (@hegdepooja) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు