పెళ్లాలు ఉన్న ఇంట్లో దెయ్యాలా?

8 Jun, 2018 00:23 IST|Sakshi
పోసాని, పృథ్వీ

... ఉండనే ఉండవని తన భార్యతో చెబుతున్నారు పోసాని కృష్ణమురళి. ‘మేకప్‌ లేని ఆడదాన్ని, బిల్డప్‌ లేని మగాణ్ని ఈ సొసైటీ గుర్తించదు రాజా’ అంటూ పోసాని డైలాగ్‌తో ప్రారంభమయ్యే ‘దేశముదుర్స్‌’ ట్రైలర్‌ నవ్వులు పంచుతోంది. పోసాని కృష్ణ మురళి, పృథ్వీరాజ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘దేశ ముదుర్స్‌’. ‘ఇద్దరూ 420 గాళ్ళే’ అన్నది ఉప శీర్షిక. కన్మణి దర్శకత్వంలో పులిగుండ్ల సతీష్‌ కుమార్, వద్దినేని మాల్యాద్రి నాయుడు సమర్పణలో కుమార్‌ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు.

‘ఏవండీ ఆ గదిలో దెయ్యం ఉందండీ’ అని భార్య రజిత భయపడుతుంటే.. ‘పెళ్లాలు ఉన్న ఇంట్లో దెయ్యాలు ఉండవే’ అంటున్నారు పోసాని. ‘రామ రామ.. మాది చాలా సాంప్రదాయమైన ఫ్యామిలీ అమ్మా’ అని రజిత చెబుతుంటే .. ‘మాదేమైనా సన్నీ లియోన్‌ ఫ్యామిలీయా’ అంటూ సెటైర్‌ వేస్తున్నారు పృథ్వీ. ‘‘ఈ నవ్వుల కహానీని చూడాలంటే ఈ నెల 22వరకూ ఓపిక పట్టాలి’’ అంటున్నారు దర్శక–నిర్మాతలు కన్మణి, కుమార్‌. పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ– ‘‘భవిష్యత్‌లో రామానాయుడుగారిలా మహీందర్‌ కూడా పెద్ద నిర్మాత అవుతారు’’ అన్నారు. ‘‘దేశముదుర్స్‌’తో కన్మణి ఏంటో నిరూపించుకుంటారు’’ అన్నారు పృథ్వీ. సంగీత దర్శకుడు యాజమాన్య, డైలాగ్‌ రైటర్‌ భవాని ప్రసాద్‌ పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు