బిగ్‌బాస్‌ సీజన్‌ 4 తాజా అప్‌డేట్‌

15 Jul, 2020 20:06 IST|Sakshi

హైదరాబాద్‌ : బిగ్‌బాస్ తెలుగు‌ సీజన్‌ 4 ఎప్పుడు ప్రారంభం అవుతుందనే దానిపై చాలా మందిలో ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షోకు సంబంధించి రకరకాలు వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో భాగంగా.. బిగ్‌బాస్‌ ఇంటిని నిర్మించేందుకు పనులు ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. గత రెండు సీజన్‌లలో మాదిరిగానే ఈ సారి కూడా సెట్‌ను అన్నపూర్ణ స్టూడియోలోనే నిర్మించనున్నారు. మరోవైపు కరోనా నేపథ్యంలో  షోను ఎలా ప్లాన్‌ చేయాలనే దానిపై నిర్వాహకులు కూడా తీవ్రంగా చర్చిస్తున్నారు. (‘నేనెప్పుడూ ఓడిపోను.. గుర్తుపెట్టుకో’)

బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్‌లు అంతా  ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తోంది. అంతేకాకుండా వారు ఫిజికల్‌ టాస్క్‌ల్లో పాల్గొనాల్సి ఉంటుంది. మిగతా షోల మాదిరిగా కాకుండా బిగ్‌బాస్‌ కోసం 250 మందికి పైగా సిబ్బంది పనిచేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా షూటింగ్‌ చేయడం అనేది నిర్వహకులు సవాలుతో కూడుకున్న పనే. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఫిజికల్‌ టాస్క్‌లు లేకుండా.. షోను డిఫరెంట్‌గా ఏమైనా ప్లాన్‌ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. 

హోస్ట్‌గా మళ్లీ ఆయనే.. 
బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 హోస్ట్‌గా ఉన్న హీరో అక్కినేని నాగార్జున..తాజా సీజన్‌కు కూడా హోస్ట్‌గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ షో హోస్ట్‌గా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ.. నిర్వాహకులు మాత్రం నాగార్జున వైపే మొగ్గు చూపారని సమాచారం. మరోవైపు ఈ షో కంటెస్టెంట్‌ల ఎంపిక తుది దశలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో షో ఎప్పుడు ప్రారంభం కానుందనే దానిపై మాత్రం స్పష్టత లేదు. మరోవైపు బిగ్‌బాస్‌ హిందీ తాజా సీజన్‌ సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వెలువడుతన్నాయి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా