కల్యాణితో జోడీ కుదిరిందా?

7 Jul, 2017 00:16 IST|Sakshi
కల్యాణితో జోడీ కుదిరిందా?

అఖిల్‌ సినిమాలో హీరోయిన్‌ ఎవరు? గత కొన్నాళ్లుగా జరుగుతోన్న చర్చ ఇది. ‘మనం’ ఫేమ్‌ విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో అఖిల్‌ ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం షూటింగ్‌ ఆరంభమైంది. అయితే కథానాయికను ఫైనలైజ్‌ చేయలేదు. దాంతో ఈ అక్కినేని యువ హీరో సరసన ఎవరు నటిస్తారు? అనే చర్చల్లో పలువురి కథానాయికల పేర్లు వినిపించాయి. తాజాగా, దర్శకుడు ప్రియదర్శన్‌ కుమార్తె కల్యాణి పేరు వినిపిస్తోంది.

మలయాళం, తమిళ్, హిందీ చిత్రాలతో పాటు నాగార్జునతో తెలుగులో ‘నిర్ణయం’ చిత్రం తెరకెక్కించారు ప్రియదర్శన్‌. తండ్రి బాటలో కల్యాణి డైరెక్టర్‌ కావాలనుకున్నారని తెలుస్తోంది. విక్రమ్‌ హీరోగా రూపొందిన ‘ఇంకొక్కడు’ సినిమాకు ఆమె అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. సో.. కల్యాణి డైరెక్టర్‌ కావడం ఖాయం అనుకుంటున్న టైమ్‌లో ఆమె కథానాయికగా చేయనుందనే వార్త వచ్చింది. మరి.. అఖిల్‌ సరసన కథానాయికగా నటించబోయేది కల్యాణియేనా? వెయిట్‌ అండ్‌ సీ.