సరైనోడు దొరకాలిగా!

22 Dec, 2017 00:21 IST|Sakshi

టాప్‌ హీరోయిన్స్‌కు తరచూ ఎదురయ్యే ప్రశ్న పెళ్లి ఎప్పుడు? అని. ఇదే ప్రశ్నను ప్రియాంకా చోప్రా ముందుంచితే.. ‘‘అయినా పెళ్లి మనం ప్లాన్‌ చేసుకున్నప్పుడు అవ్వదు. మనసుకి నచ్చినవాడు దొరకాలి కదా. అలాంటి వాడు ఇంకా నాకు తారస పడలేదు’’ అని పేర్కొన్నారు ఈ 35 ఏళ్ల ముద్దుగుమ్మ. బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు మకాం మార్చేసి వరుస సినిమాలతో బిజీ అయిపోయారు ప్రియాంక. ‘‘సినిమాలు చేయడానికే టైమ్‌ సరిపోతోంది.

ఇక పెళ్లి గురించి ఆలోచించే టైమ్‌ ఎక్కడుంది?’’అని సన్నిహితులతో అంటున్నారట ప్రియాంక.  ‘ఎ కిడ్‌ లైక్‌ జెక్‌’, ‘ఈజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ వంటి చిత్రాలతో హాలీవుడ్‌లో బిజీ బిజీగా ఉన్నారామె. మరి.. బాలీవుడ్‌ చిత్రాల సంగతేంటి? అంటే.. వ్యోమగామి రాకేష్‌ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌ కోసం తనను సంప్రదించినట్టు ప్రియాంక పేర్కొన్నారు.  ఇందులో  రాకేష్‌ శర్మగా ఆమిర్‌ ఖాన్‌ కనిపిస్తారు. సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

మరిన్ని వార్తలు