డ్రైవర్‌ పుష్పరాజ్‌

9 Apr, 2020 03:52 IST|Sakshi

పుష్పరాజ్‌గా మారిపోయారు అల్లు అర్జున్‌. ఎందుకంటే తన కొత్త చిత్రం కోసం. ‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు ముత్తం శెట్టి మీడియా సహ–నిర్మాత.

బుధవారం (ఏప్రిల్‌ 8) అల్లు అర్జున్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘పుష్ప’ టైటిల్‌ను, ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పూర్తిగా చిత్తూరు యాస మాట్లాడే పుష్పరాజ్‌ పాత్రలో కనిపిస్తారు అల్లు అర్జున్‌. పుష్పరాజ్‌ లారీ డ్రైవర్‌ అట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో  ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, లైన్‌ ప్రొడ్యూసర్‌: బాలసుబ్రహ్మణ్యం కేవీవీ, సీఈఓ: చెర్రీ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా