‘గీత గోవిందం’ నా సినిమాకు కాపీ..

30 Aug, 2018 09:54 IST|Sakshi
గీత గోవిందం చిత్రాన్ని అభినందించిన దర్శకేంద్రుడు

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా గీత గోవిందం. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వందకోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖలు ఈ చిత్రాన్ని అభినందించారు. ప్రస్తుతం వీరి కోవలోకి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా చేరారు. ఒక అవార్డుల కార్యక్రమానికి హజరైన రాఘవేంద్ర రావు ‘గీత గోవిందం’ సినిమాను అభినందిస్తూ.. ఈ సినిమాను చూస్తే 20 ఏళ్ల క్రితం నేను శ్రీకాంత్‌తో తీసిన ‘పెళ్లి సందడి’ చిత్రం గుర్తుకు వచ్చింది అని తెలిపారు.

దర్శకుడు పరుశురాం ‘పెళ్లి సందడి’ సినిమాను కాపీ కొట్టాడేమో అనిపించిందన్నారు. అసభ్యతకు తావు లేకుండా చాలా చక్కగా గీత గోవిందం చిత్రాన్ని తెరకెక్కించాడని అభినందించారు. చిన్న సినిమాగా విడుదలైన గీత గోవిందం ఇంత భారీ విజయాన్ని సాధించడం గొప్ప విషయం. ఈ విషయంలో దర్శకుడు పరుశురామ్‌ని మెచ్చుకోవాలి అని తెలిపారు.

20 ఏళ్ల క్రితం రాఘవేంద్ర రావు దర్శకత్వంలో, అల్లు అరవింద్‌, అశ్విని దత్‌లు నిర్మాతలుగా ‘పెళ్లి సందడి’ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీకాంత్‌ హీరోగా, రవళి, దీప్తి భట్నాగర్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మూడు నంది అవార్డులను అందుకుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు