అమితాబ్‌ బచ్చన్‌కు కమల్, రజనీ పరామర్శ

13 Jul, 2020 09:12 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్, నటుడు రజినీకాంత్‌ పరామర్శించారు. ప్రస్తుతం ప్రపంచం అంతా కరోనా కష్టకాలం నడుస్తున్న విషయం తెలిసిందే. పేద గొప్ప అన్న భేదం లేకుండా ఈ మహమ్మారి అందరినీ బాధిస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబాన్ని తాకింది. దీని గురించి శనివారం నటుడు అమితాబ్‌ బచ్చన్‌ స్వయంగా మీడియాకు తెలిపారు. అందులో ఆయన పేర్కొంటూ తన కుటుంబం అంతా కరోనా టెస్టులు చేయించుకున్నట్లు తెలిపారు. (విలన్‌ కరోనా)

తనకు, కొడుకు అభిషేక్‌ బచ్చన్‌ కరోనా వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. తన భార్య జయాబచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్కి కరోనా టెస్టులో నెగిటివ్‌ వచ్చిందని తెలిపారు. అదేవిధంగా తనతో పరిచయాలు ఉన్న అందరూ కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలని అమితాబచ్చన్‌ హితవు పలికారు. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబం కరోనా భారీ నుంచి త్వరగా కోలుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ ట్విట్టర్లో పేర్కొంటూ ఇద్దరూ బచ్చన్‌లు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ సమస్యను వైద్యుల వల్ల తన ఆత్మ విశ్వాసం వల్ల అమితాబ్‌ బచ్చన్‌ అధిగమించగలరని తాను నమ్ముతున్నట్లు కమల్‌ పేర్కొన్నారు. అదేవిధంగా ఈ విషయం తెలియగానే అమితాబ్‌ బచ్చన్‌ సన్నిహితుడు రజనీకాంత్‌ వెంటనే ఆయనకు ఫోన్‌ చేసి పరామర్శించారు. ఆరోగ్యం గురించి, వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. మరో విషయం ఏంటంటే అమితాబ్‌ బచ్చన్‌ పేర్కొంటూ తనకు తన కొడుకు అభిషేక్‌ బచ్చకు కరోనా సింటంస్‌ ఉన్నట్లు వైద్యులు తెలిపారని, అయితే తన భార్య జయాబచ్చన్, ఐశ్వర్యరాయ్‌కి టెస్టులో నెగిటివ్‌ వచ్చినట్లు చెప్పారని అన్నారు. అయితే తాజా సమాచారం బట్టి నటి ఐశ్వర్యరాయ్‌కి, ఆమె కూతురు ఆరాధ్యకు కూడా కరోనా వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది.  
(ఐశ్వర్య రాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా