ముత్తు మళ్లీ వస్తున్నాడు 

19 Nov, 2023 03:18 IST|Sakshi

పాతికేళ్ల క్రితం రజనీకాంత్‌ నటించిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘ముత్తు’ (1995) ఒకటి. రజనీకాంత్‌ మాస్‌ యాక్షన్, కామెడీ, చిత్రకథానాయిక మీనాతో ‘థిల్లానా.. థిల్లానా..’ అంటూ చేసిన డ్యాన్స్‌ ఆయన అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి.

కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ముత్తు’ మళ్లీ తెరపైకి రానున్నాడు. డిసెంబర్‌ 12న రజనీకాంత్‌ బర్త్‌ డే సందర్భంగా పది రోజుల ముందు (డిసెంబర్‌ 2) ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక.. ఈ నాలుగుప్రాంతాల్లోని థియేటర్లలో ‘ముత్తు’ మళ్లీ విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌. 

మరిన్ని వార్తలు