నావీ షిప్‌లో అగ్ని ప్రమాదం.. 17 మందికి గాయాలు

13 Jul, 2020 09:13 IST|Sakshi

లాస్‌ ఏంజిల్స్‌ : కాలిఫోర్నియాలోని యునైటెడ్‌ స్టేట్స్‌ నావీ షిప్‌లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. శాన్‌డియాగో ఓడరేవులో ఉన్న యూఎస్‌ బోన్హోమ్‌ రిచర్డ్‌, ఆన్ అంఫిబియస్‌ అసల్ట్‌ నౌకలో అనూహ్యంగా పొగలు కమ్ముకోవడంతో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఈ దుర్ఘటనలో 21 మంది గాయపడినట్లు అధికారులు, స్థానిక మీడియా పేర్కొంది. దట్టమైన పొగ పీల్చడం ద్వారా 17 మంది నావికులు నలుగురు పౌరులు తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.  అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఘటన సమయంలో సుమారు 160 మంది నావికులు పోర్టులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. (ఐదురోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు